కొందరి చర్మం.. జిడ్డుగా ఉంటుంది. సెబమ్ గ్రంథులు అధికంగా నూనెలను ఉత్పత్తి చేయడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. ఇంకొందరిలో జన్యుపరంగా ఉంటే, మరికొందరిలో హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి.. ఇలా రకరకాల కారణాలతో ‘జిడ్డు చర్మం’ ఇబ్బంది పెడుతుంది. ఇక వేసవిలోనైతే చెమటతో కలిసి.. మరింత అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కొన్ని చిన్నచిన్న చిట్కాలు పాటించడం ద్వారా.. ‘జిడ్డు చర్మం’ సమస్యలకు ఇట్టే చెక్ పెట్టొచ్చని అంటున్నారు సౌందర్య నిపుణులు.
ఈ చిట్కాలను పాటిస్తే.. జిడ్డు చర్మం సమస్యను గణనీయంగా తగ్గించవచ్చు. ఎండకాలంలోనూ అందంగా మెరిసిపోవచ్చు.