‘నేను చేయాలనుకున్నదే చేస్తాను. చేసేదేదో నిజాయతీగా చేస్తాను. జీవితాన్ని పరిపూర్ణంగా
ఆస్వాదిస్తాను’ అంటున్నది అందాల రాణి శోభిత ధూళిపాళ. తాజాగా ‘హలో’ మేగజైన్ ఆర్ట్ ఎడిషన్ ముఖచిత్రంగా శోభించింది శోభిత. ‘కళాత్మకమైన ఎడిషన్‌కు కవర్‌పేజీ బొమ్మగా ఎవర్ని ఎంచుకోవాలా అని ఆలోచిస్తున్నప్పుడు తనే గుర్తుకొచ్చింది’ అంటారు ‘హలో’ సంపాదకులు. నిజమే, కొందర్ని చూస్తున్నప్పుడు.. మంచి పెయింటింగ్‌ను ఆస్వాదిస్తున్న అనుభూతి కలుగుతుంది.