1-2-10 రూల్ ట్రై చేద్దామా !
స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, టెలివిజన్లు మన దినచర్యలో భాగమైపోయాయి. అయితే, ఈ స్క్రీన్లను కళ్లకు ఎంత దూరంలో ఉంచాలనే దానిపై చాలామందికి అవగాహన ఉండటం లేదు. వెలిగే తెరలను చాలా దగ్గరగా చూడటం వల్ల కంటి కండరాలు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతాయి.
స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, టెలివిజన్లు మన దినచర్యలో భాగమైపోయాయి. అయితే, ఈ స్క్రీన్లను కళ్లకు ఎంత దూరంలో ఉంచాలనే దానిపై చాలామందికి అవగాహన ఉండటం లేదు. వెలిగే తెరలను చాలా దగ్గరగా చూడటం వల్ల కంటి కండరాలు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతాయి. ఈ సమస్యను నివారించడానికి అంతర్జాతీయ కంటి వైద్య నిపుణులు ‘1-2-10’ అనే సులభమైన సూత్రాన్ని సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లల్లో చిన్న వయసులోనే కంటి చూపు మందగించకుండా ఉండేందుకు ఇది సాయపడుతుందట. అలాగే పెద్దలు పాటిస్తే కళ్లను మరింత కాలం భద్రంగా ఉంచుకోవచ్చు.
దీని ప్రకారం స్క్రీన్ల దూరం ఇలా ఉండాలి
1 అడుగు (మొబైల్ ఫోన్లు): స్మార్ట్ఫోన్లు లేదా ట్యాబ్స్ని ఉపయోగించేటప్పుడు అవి మన కళ్లకు కనీసం 1 అడుగు (సుమారు 30 సెంటీమీటర్లు) దూరంలో ఉండేలా చూసుకోవాలి.
2 అడుగులు (ల్యాప్టాప్/ కంప్యూటర్): కార్యాలయాల్లో లేదా ఇంట్లో కంప్యూటర్, ల్యాప్టాప్ స్క్రీన్ల ముందు కూర్చున్నప్పుడు.. స్క్రీన్కు, కంటికి మధ్య కనీసం
2 అడుగుల (సుమారు 60 సెంటీమీటర్లు) దూరం ఉండాలి. అంటే దాదాపు మన చేతి పొడవు అంత దూరం పాటించాలి.
10 అడుగులు (టెలివిజన్): ఇంట్లో టీవీ చూసేటప్పుడు స్క్రీన్ పరిమాణాన్ని బట్టి కనీసం 10 అడుగుల దూరం నుంచి వీక్షించడం కంటికి సురక్షితం.
ఈ ‘1-2-10’ నియమాన్ని పాటించడం వల్ల కంటిపై పడే కాంతి తీవ్రత తగ్గి, చూపు మందగించకుండా ఉంటుంది. ఇంత ఈజీగా కళ్లను రక్షించుకోవచ్చు అంటే మీరు మాత్రం ట్రై చేయకుండా ఎందుకు ఉంటారు!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

