Small Plates | కడుపు నిండా తినాలంటే.. ప్లేటు నిండా వడ్డించుకోవాలి. మరి, ప్లేటు చిన్నదైతే? ఏముందీ.. నాలుగైదు సార్లు నింపేసుకోవడమే! అంటారా? ఆగండాగండి. ఇప్పుడు చిన్న ప్లేట్లలో తినడమే ఫ్యాషన్. పెద్ద పెద్ద రెస్టారెంట్లన్నీ ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నాయి. ఫుడ్ లవర్స్ కూడా ‘స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్’ అంటున్నారు.

Small
అరిటాకంత కంచంలో పంచభక్ష్య పరమాన్నాలు వడ్డించే రోజులు పోయాయి. చిట్టి చిట్టి ప్లేట్లలో నచ్చిన వంటకాలను కొంచెం కొంచెం వడ్డించుకోవడమే. హోటల్ చిన్నదైనా.. పెద్దదైనా.. ప్లేట్లు మాత్రం చిన్నగానే ఉంటున్నాయి. గల్లీ హోటల్ నుంచి.. స్టార్ హోటళ్ల వరకు ఇప్పుడు ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నాయి.

Small Plates2
చిన్న ప్లేట్లలో వడ్డన కాన్సెప్ట్ ఫారిన్లో బాగా పాపులర్ అయ్యింది. రష్యా, కొరియా, ఇటలీ వంటి దేశాల్లో చిన్న పాత్రల్లోనే వడ్డించుకుంటారు. రష్యన్లో జకుస్కి, కొరియన్లో బంచాన్, ఇటాలియన్లో యాంటిపాస్తి పేరుతో ఈ బఫే సిస్టమ్‌ను పిలుస్తారు. ఇప్పుడు ఆ ట్రెండ్ ఇండియాకూ విస్తరించింది.

Small Plates3
ఇందుకుగానూ.. డిజైనర్ పింగాణి పాత్రలు, లోహపు పళ్లాలు, గాజు గిన్నెలు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఒకేసారి ప్లేట్ నిండా పెట్టుకొని మొహం మొత్తేలా వడ్డించుకునే పద్ధతికి స్వస్తి చెప్పి.. కస్టమర్లను ఆకర్షించేందుకు ఎక్కువగా వంటకాలను చిన్న చిన్న పాత్రల్లో పెట్టి అందంగా వడ్డించడం మొదలుపెట్టాయి ఇండియన్ రెస్టారెంట్లు.

Small Plates5
బెంగళూరు, ముంబై, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఈ ధోరణే నడుస్తున్నది. ఈ చిన్న ప్లేట్ల పుణ్యమాని వడ్డన మాత్రమే కాదు.. షేర్ చేసుకోవడం కూడా సులభమే. మార్కెట్లో అందుబాటులో ఉన్న రకరకాల ఫుడ్ వెరైటీలకు ఈ స్మాల్ ప్లేట్ కాన్సెప్ట్ కరెక్ట్ సెట్ అవుతుంది.

Small Plates6
శుభకార్యాల్లో విదేశీ వంటకాలను సైతం స్మాల్ ప్లేటరీలలో అయితే.. ఈజీగా వడ్డించొచ్చు అంటున్నారు చెఫ్‌లు. చిన్న ప్లేట్లలో వడ్డిస్తే తమకు నచ్చిన వెరైటీలను రుచి చేసి.. నచ్చనివి వేస్ట్ చేయకుండా అలాగే ఉంచుతారు. ఫలితంగా వృథా తగ్గుతుందని వాళ్ల భావన. తరచూ పార్టీలకు వెళ్లేవారు ఒంటి బరువును అదుపులో ఉంచుకోవడానికి ఇదో మార్గం కూడా.

Ccl

Small Plates7

Small Plates8

Small Plates9