హార్డ్వేర్లో ఎన్ని మార్పులు చేసినా.. సరైన సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్ లేకపోతే ఏం ప్రయోజనం! యూజర్లను ఆకట్టుకోవడం కష్టమే. ఈ విషయంలో నిత్యం అలర్ట్గా ఉండే సామ్సంగ్ కొత్తగా One UI 7 యూజర్ ఇంటర్ఫేస్ విడుదల చేయనుంది.
ఏప్రిల్ 7 నుంచి Galaxy S24 సిరీస్, Galaxy Z Fold6, Z Flip6 డివైజ్లకు అప్డేట్ అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత ఇతర Galaxy ఫోన్లు, ట్యాబ్లెట్లకు కూడా రోలౌట్ చేయనున్నారు. కొత్త One UI 7లో డిజైన్ మార్పులు, AI ఆధారిత స్మార్ట్ ఫీచర్లు, మరిన్ని పర్సనలైజేషన్ ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి.