అందాన్ని కాపాడుకోవడానికి కొందరు పడరానిపాట్లు పడుతుంటారు. బ్యూటీ పార్లర్లు, సౌందర్య ఉత్పత్తులు అంటూ ఖాతాలను ఖాళీ చేసుకుంటారు. అయితే, రూపాయి ఖర్చులేకుండా.. రైస్ వాటర్‌తో నైస్‌గా కనిపించొచ్చు. బియ్యం కడిగిన నీళ్లలో అనేక పోషకాలు, ఖనిజాలతోపాటు యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి.