చలికాలం పగటి పూటైనా స్వెటర్ తప్పదు. వాతావరణాన్ని బట్టి కాలేజీలు, ఆఫీసులకు స్వెటర్లో వెళ్లాల్సి వస్తుంది. అలాంటప్పుడు మళ్లీ మళ్లీ ధరించడమంటే.. పరమ బోర్. అందుకే, రివర్సబుల్ స్వెట్షర్ట్లకు అంత గిరాకీ. ఇవి లోపలా బయటా వేర్వేరు రంగులు, డిజైన్లలో ఉంటాయి. అంటే.. మామూలుగా వేసుకుంటే ఒక స్వెటర్, తిప్పి వేసుకుంటే ఇంకో స్వెటర్! హుడీ ఉన్నవీ, లేనివీ ఉంటాయి. ఒక వైపు డిజైన్‌తో, మరోవైపు సాదాగా.. రెండు వైపులా సాదాగా, రెండు వైపులా డిజైన్లతోనూ లభిస్తున్నాయి. ఒక రివర్సబుల్ చలికోటును కొనుక్కుంటే రెండు డ్రెస్‌లతో సమానం. చలికి డబుల్ మస్కా కొట్టేయవచ్చు.