వన్నెల దుస్తుల వేడుక క్రిస్మస్. కేకుల తీయదనం, కీర్తనల మాధుర్యం, పాస్టర్ ప్రసంగాల ఆధ్యాత్మికం.. డిసెంబరు నెలకు కొత్త శోభను తెస్తాయి. థీమ్ ఆఫ్ ది సీజన్.. రెడ్. ఫొటోలో.. ఎరుపు రంగు నెట్టెడ్ లెహంగాకు సెల్ఫ్ ఎంబ్రాయిడరీతో కొత్త మెరుపు వచ్చింది.
అదే వర్ణం పెప్పులమ్ టాప్.. టాప్ క్లాస్! పాతకొత్తల మేలు కలయికలా ఉందీ డిజైనర్ డ్రెస్. క్రిస్మస్ తాత తప్పక కరుణిస్తాడు. గ్రీకు వీరుడినో, రాకుమారుడినో వరుడిగా ప్రసాదిస్తాడు.