ఏ వస్తువు కొందాం అనుకున్నా సరే.. దాంట్లో ఏంటి స్పెషల్ అనేది నిశితంగా చూస్తాం. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ కొనేటప్పుడు అయితే చెప్పనక్కర్లేదు. మొత్తం జల్లడపట్టేసి ఓ ఫోన్ సెలెక్ట్ చేస్తాం. అందుకే ‘రియల్ మీ’ సంస్థ ‘14 ప్రో 5G’ సిరీస్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఇందులో 14 ప్రో, 14 ప్రో+ మోడళ్లు ఉన్నాయి. ఫోన్ బ్యాక్ ప్యానల్ రంగులు మారడం వీటిలోని ప్రత్యేకత. ఈ తరహా ఫీచర్‌తో వచ్చిన మొట్టమొదటి ఫోన్ సిరీస్ ఇదే. ఈ ఫోన్ వెనుక భాగం నీటిలో తడిపితే చాలు.. భిన్నమైన వర్ణాలు కనువిందు చేస్తాయి.
IP66, IP68, IP69 సర్టిఫికేషన్లతో ఫోన్‌కి సేఫ్టీ కల్పించారు. అందుకే ఫోన్ నీళ్లలో తడిసినా పాడవదు. పైగా రంగులు మారుతూ అలరిస్తుంది. తెలుపు రంగులో తయారైన ఈ ఫోన్ బ్యాక్ కవర్ టెంపరేచర్ 16 డిగ్రీల కన్నా తక్కువ నమోదైనప్పుడు రంగు మారుతుంది. ‘రియల్ మీ 14 ప్రో’ వెనక భాగంలో మూడు కెమెరా సెన్సార్లు.. మూడు ఎల్ఈడీ ఫ్లాష్‌లు ఉన్నాయి. అంతేకాదు ఇందులోని ‘క్వాడ్కర్డ్ డిస్ ప్లే’ కారణంగా రౌండ్ కార్నర్స్ స్క్రీన్ కొనల వరకూ దృశ్యం కనిపిస్తుంది. ఈ నెలలోనే ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.