రవివర్మ బతికుంటే.. దమయంతి చిత్రం మరోలా గీసేవారు. ఫలసుందరి పటం ఇంకోలా వచ్చేది. అపర్ణా జనార్దనన్నే మాడల్‌గా ఎంచుకునేవారు. ఇద్దరి మధ్యా కేరళీయ బంధుత్వం ఉండనే ఉన్నది.
ముక్కున చక్కని ముక్కెర, మెడలో లక్ష్మీహారం, ముడిలో మల్లె మొగ్గలు, చెవికి లోలాకులు.. అచ్చమైన సంప్రదాయ సోకులతో అపరంజిలా మెరిసిపోతున్నది కదూ.. అపర్ణ.