జై..జపాండి
ఆసియా తూర్పు భాగంలోని జపాన్‌కు, ఐరోపాలోని స్కాండినేవియా ప్రాంతానికి పెద్దగా పోలికలు లేవు. ఒక్క గృహాలంకరణ విషయంలో మాత్రం.. ఉమ్మడి అభిరుచులు ఉన్నాయి.
ఆసియా తూర్పు భాగంలోని జపాన్‌కు, ఐరోపాలోని స్కాండినేవియా ప్రాంతానికి పెద్దగా పోలికలు లేవు. ఒక్క గృహాలంకరణ విషయంలో మాత్రం.. ఉమ్మడి అభిరుచులు ఉన్నాయి. జపాన్‌లోని జపా, స్కాండినేవియాలోని ఆండీలను కలపగా ఏర్పడిన గృహాలంకరణ శాస్త్రమే జపాండి.
మినిమలిజం జపాండి ప్రత్యేకత. ప్రకృతి సిద్ధమైన మెటీరియల్‌నే ఉపయోగిస్తారు. ప్లాస్టిక్, ఫైబర్ నిషిద్ధం. తేలికైన రంగులనే ఎంచుకుంటారు. ముదురు వర్ణాలు దూరం దూరం. సహజమైన వెలుగులకు విలువ ఇస్తారు. కృత్రిమ విద్యుత్ దీపాలు దాదాపుగా ఉండవు.
చెక్క లేదా రాతితో చేసిన అలంకరణ వస్తువులు వాడతారు. ప్రతి మూలా పూలకుండీ ఉండాల్సిందే. గదిని ఫర్నిచర్‌తో నింపేయకుండా.. ఒకటి రెండు వస్తువులకే పరిమితం చేస్తారు.
గదిలోకి సహజమైన వెలుతురు ధారాళంగా వచ్చేలా చూస్తారు. ఈ శైలిలో దాదాపుగా కర్టెన్లు ఉండవు. సూర్యకాంతిని అడ్డుకోవడం పాపమని నమ్ముతారు.
తెలుపు, తేలికైన ఇసుక రంగు, లేత గచ్చకాయ రంగులకు జపాండి అలంకరణలో పెద్దపీట వేస్తారు. లేత బూడిద, లేత గులాబీ, లేత నీలం, లేత ఆకుపచ్చ రంగులనూ జొప్పిస్తారు.
ఫర్నిచర్ విషయానికి వస్తే రోజువారీ వాడుకలో పనికొచ్చే వాటికే స్థానం. అవసరానికి ఉపయోగపడని వస్తువు ఎంత అందంగా ఉన్నా.. వృథాయే అంటుంది జపాండి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

