వెలుగు-నీడలు.. ఫొటోల మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. ప్రకాశవంతమైన, మృదువైన వెలుగులు.. సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. చీకటి, తీవ్రమైన నీడలు.. విషాదకరమైన, రహస్యమైన మానసిక స్థితిని కలిగిస్తాయి. అందుకే.. ఫొటోగ్రఫీలో లైట్-షాడోస్ అనేవి కీలకంగా మారతాయి. ఇవి రెండూ కలిసి.. ఫొటోకు మరింత డెప్త్, డ్రామాతోపాటు వాస్తవికతనూ జత చేస్తాయి. కాస్త సృజనాత్మకంగా ఆలోచిస్తే.. స్మార్ట్‌ఫోన్‌తోనే అద్భుతమైన వెలుగు-నీడల ఫొటోలు వస్తాయి.
ఫ్రేమింగ్ ఫొటోల్లో భావోద్వేగాలు, నాటకీయతను సృష్టించడంలో వెలుగు-నీడలు కీలకంగా పనిచేస్తాయి. వెలుగు.. సబ్జెక్ట్ స్పష్టంగా కనిపించేలా చేస్తుంది. నీడలు.. ఫొటో మరింత వాస్తవికంగా కనిపించేలా చేస్తాయి. వాటికి డెప్త్, మూడ్‌ను జోడిస్తాయి. ఫొటోగ్రాఫర్లు ఈ రెండు అంశాలనూ ఉపయోగించి.. ఫొటోల్లో వివిధ రకాల ప్రభావాలను సృష్టించగలరు.
అవసరమైనవి :
మంచి సమయం :
టిప్స్ – ఐడియాస్
1. లైట్‌ని గమనించండి
వెలుతురు ఎలా పడుతున్నది? దానితో ఎక్కడెక్కడ నీడలు ఏర్పడుతున్నాయి? అనే విషయాలను గమనిస్తూ ఉండాలి. వెలుగు నీడలతో ప్రతివస్తువూ కొత్తగా కనిపిస్తుంది. దాన్ని ఒడిసిపట్టండి.
2. శరీర నీడలతో ప్రయోగాలు
మీ చేతి, ముఖం, ఇతర శరీర భాగాలను వెలుతురు వైపు ఉంచి.. నీడలను ఫ్రేమ్ చేయండి.
3. కిటికీల నుంచి..
కిటికీల్లోంచి వచ్చే కాంతి.. ఇంటిని సరికొత్తగా చూపిస్తుంది. ఇక జాలిలా పడే నీడలతోనూ విభిన్నమైన డిజైన్లు కనిపిస్తాయి. వాటినీ ఫొటోలుగా మలుచుకోవచ్చు.
4. ఆబ్జెక్ట్స్తోనూ..
వెలుతురు పడే కోణాన్ని బట్టి.. తరచూ ఉపయోగించే వస్తువుల నీడలూ భిన్నంగా కనిపిస్తాయి. మొక్కలు, కాఫీ కప్పు, బుక్, కుర్చీ వీటి నీడలు ఆసక్తికరంగా ఉంటాయి.
5. రిఫ్లెక్షన్స్
గ్లాస్, నీటిపై కాంతి పడినప్పుడు వచ్చే ప్రతిబింబాలతో కూడిన నీడలు కూడా అందంగా ఉంటాయి.
కెమెరా సెట్టింగ్స్ (మొబైల్లో)
ఎడిటింగ్ సూచనలు
స్నాప్‌సీడ్, లైట్‌రూమ్ మొబైల్, వీఎస్‌సీఓ.. యాప్స్ ద్వారా ఫొటోలను ఎడిట్ చేసుకోవచ్చు.
చేయాల్సినవి :
చేయకూడనివి :
ఫైనల్‌గా.. లైట్ అండ్ షాడోస్ ఫొటోగ్రఫీ అనేది భావోద్వేగాలను సృష్టించే కళ. వీటి సాయంతో తీసే ప్రతి ఫొటో.. ఒక కథ చెబుతుంది. వీక్షకులకు మరింత లోతైన ఫీలింగ్‌ను కలిగిస్తుంది. మీ చేతిలోని మొబైల్‌తోనే.. సాధారణ వస్తువులను అద్భుతమైన చిత్రాలుగా మార్చవచ్చు. ఇందుకోసం ఎక్కడెక్కడో తిరగాల్సిన పనిలేదు. కేవలం కాంతిని చూడగలగాలి. నీడలను గమనించగలగాలి. అంతే!
…? ఆడెపు హరికృష్ణ