కొలను నీటి కొనాకు నిలబడి తిత్తిరిపిట్ట చూసే బిత్తిరి చూపులు మనసును హత్తుకుంటాయి.
వినువీధుల్లో విహంగాల హంగామా చూసేందుకు రెండు కండ్లు చాలవు. తొలకరి చినుకుల్లో మైమరచి ఆడుతున్న మయూరాన్ని
మనసుతో దర్శించాలి. ప్రకృతి ఒడిలో అనుక్షణం ఆనందం అనుభవించే పక్షులను ప్రత్యేక క్షణంలో క్లిక్ మనిపిస్తే…
వాటి అసలైన సోయగం ఎంత గొప్పగా ఉంటుందో తెలుస్తుంది. ప్రకృతిలో విహరించడం, విహంగాలను కెమెరాలో బంధించడం.. ఒక అద్భుతమైన ప్రయాణం! కానీ, బర్డింగ్ (పక్షుల్ని ఫొటోలు తీయడం) కోసం పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు.
చెరువులు, పెద్దపెద్ద పార్కుల్లో పక్షులు విరివిగా కనిపిస్తాయి. వాటి సహజసిద్ధమైన వాతావరణంలో షూట్ చేస్తే..
మంచి ఫొటోలు వస్తాయి. బర్డ్ ఫొటోగ్రఫీలో పక్షుల ఆకృతి, వాటి రంగులు, ప్రవర్తన, ఎగరడం,
గూడు కట్టడం వంటి క్షణాలను డీఎస్ఎల్ఆర్ సాయంతో పట్టుకోవచ్చు.
ఫొటోగ్రఫీ అనేది కొందరికి వృత్తి! మరికొందరికి ప్రవృత్తి! అలా, ఫొటోగ్రఫీని ఒక హాబీగా మార్చుకున్నవాళ్లు చాలామంది. అలాంటివాళ్లంతా ఎక్కువగా ఆసక్తి చూపేది వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీపైనే! అందులో ఒక ప్రత్యేక విభాగమే.. బర్డ్ ఫొటోగ్రఫీ!
డీఎస్ఎల్ఆర్ ఎందుకు?
అవసరమైన పరికరాలు
1. డీఎస్ఎల్ఆర్ కెమెరా: సోనీ, నికాన్, కెనాన్ లాంటి బ్రాండ్లు
2. టెలీఫొటో లెన్స్ (300mm – 600mm): దూరంలోని పక్షులను కూడా స్పష్టంగా ఫొటోలు తీయడానికి.
3. ట్రైపాడ్/ మోనోపాడ్: కెమెరా షేక్ అవ్వకుండా ఉండేందుకు.
4. మెమొరీ కార్డ్స్, ఎక్స్ట్రా బ్యాటరీలు: ఎక్కువ ఫొటోలు తీయడానికి.
5. క్యామోఫ్లాజ్ డ్రెస్/ హైడ్ టెంట్: పక్షులు గమనించకుండా, వాటికి దగ్గరగా వెళ్లేందుకు.
ముఖ్యమైన సెట్టింగ్స్
ఎగురుతున్న పక్షులు (Birds in Flight): కనీసం 1/1000 sec లేదా 1/2000 sec వాడాలి.
నెమ్మదిగా కదిలే పక్షులు (Perched Birds): 1/250 sec – 1/500 sec సరిపోతుంది.
క్రియేటివ్ (Motion Blur): పక్షుల కదలికను బ్లర్‌గా చూపించడానికి.. 1/30 sec – 1/60 sec
అపర్చర్ (f-stop)
పొర్ట్రెయిట్ స్టయిల్: ఒకే పక్షిని ఫొటో తీయాలంటే.. f/4 – f/5.6 (బ్యాక్ గ్రౌండ్ బ్లర్ అవ్వడంతోపాటు బొకే ఎఫెక్ట్ కోసం)
పక్షుల గుంపు: f/8 – f/11 (అన్ని పక్షులూ ఫోకస్లో రావడానికి)
లాంగ్ లెన్స్ (600mm+) వాడితే.. f/8 లేదా అంతకన్నా ఎక్కువ అపర్చర్ వాడటం మంచిది. అప్పుడు ఫొటోల్లో షార్ప్‌నెస్ పెరుగుతుంది.
ఐఎస్వో
లైటింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు.. ఐఎస్వో 100 – 400.
ఉదయం / సాయంత్రం పూట.. ఐఎస్వో 800 – 1600.
ఆటోఫోకస్ (AF) సెట్టింగ్స్
ఫోకస్ ఏరియా మోడ్
బర్డింగ్ టిప్స్:
సరైన ప్రదేశాలు
తెల్లవారు జామున 5 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు పక్షులు ఎక్కువ చురుకుగా ఉంటాయి. అలాంటి సమయంలో మంచిమంచి ఫొటోలు వస్తాయి. గోధూళి వేళలో గూళ్లన్నీ కన్నులు చేసుకొని పక్షుల రాకకోసం ఎదురు చూస్తుంటాయి. మీ ప్రయోగాలకు ఆ సమయం పర్ఫెక్ట్గా సూటవుతుంది.
జాగ్రత్తలు
చివరగా.. పక్షుల ఫొటోగ్రఫీ అనేది కేవలం ఫొటోలు తీయడం మాత్రమే కాదు. ప్రకృతిని మరింత దగ్గరగా గమనించడం. ప్రకృతితో కలిసిపోవడం కూడా. ఒక్క డీఎస్ఎల్ఆర్ కెమెరా, సరైన పరికరాలు, కాస్త ఓపిక, కొంచెం క్రియేటివిటీ, ఎక్స్పోజర్ సెట్టింగ్స్‌పై అవగాహన ఉంటే చాలు. అద్భుతమైన పక్షుల చిత్రాలను సృష్టించగలుగుతారు.
…? ఆడెపు హరికృష్ణ