Health Tips | రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకోకుండా ఉండాలంటే ఈ ఫ్రూట్ తినండి!
Health Tips | ఫైబర్, విటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్ గని ప్యాషన్ ఫ్రూట్ (కృష్ణఫలం). దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ. లోపల గింజలు కూడా ఎక్కువే. కృష్ణ ఫలాలు ఊదా, పసుపు రంగుల్లో లభిస్తాయి. ఈ పండు ప్రయోజనాలు..
Health Tips | ఫైబర్, విటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్ గని ప్యాషన్ ఫ్రూట్ (కృష్ణఫలం). దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ. లోపల గింజలు కూడా ఎక్కువే. కృష్ణ ఫలాలు ఊదా, పసుపు రంగుల్లో లభిస్తాయి. ఈ పండు ప్రయోజనాలు..
- యాంటీఆక్సిడెంట్లు, విటమిన్-సి, పాలీ
- ఫినాల్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడతాయి. దీర్ఘకాలిక రోగాల ముప్పును తగ్గిస్తాయి.
- కృష్ణఫలం తక్కువ ైగ్లెసిమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉంటుంది. అంటే, వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయులు వేగంగా పెరగవన్నమాట. డయాబెటిస్ రోగులు కూడా తినొచ్చు.
- ఫైబర్ ఎక్కువ. దీంతో ఎక్కువసేపు కడుపు నిండినట్టు ఉంటుంది. పైగా మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది.
- కృష్ణఫలాల్లోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-సి, ఇతర మూలకాల కారణంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
- పొటాషియం అపారం. ఇది గుండె ఆరోగ్యానికి మేలుచేస్తుంది. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకోకుండా నివారిస్తాయి.
- ఫైబర్ మన పొట్టకు ప్రీబయోటిక్‌లా వ్యవహరిస్తుంది. ఉదరంలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందేలా చేస్తుంది. ఇది మనల్ని ఎన్నో రోగాల నుంచి కాపాడుతుంది. మన క్షేమానికి హామీ ఇస్తుంది.
తినడం ఎలా?
తొక్క తీసి నేరుగా తినేయవచ్చు. యోగర్ట్‌తో కలుపుకొని తినొచ్చు. ఇతర పండ్లతో జోడించి స్మూతీగా ఆరగించ వచ్చు. ఫ్రూట్ సలాడ్స్‌లో కలుపుకోవచ్చు. కొంచెం చక్కెర కలిపి జెల్లీలా చేసుకుంటే భోజనం తర్వాత డెజర్ట్‌గానూ మంచిదే. అయితే, కృష్ణఫలంలో సహజమైన చక్కెరలు ఉంటాయి. ఎక్కువ తింటే బరువు పెరుగుతారు. జీర్ణ సంబంధమైన ఇబ్బందులు తలెత్తుతాయి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు కొంత ఆలోచించి తినడమే మేలు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

