నెలసరిలో నిషిద్ధమా?
నెలసరిలో బొప్పాయి, పైనాపిల్ లాంటివి తినకూడదు అంటారు. ఈ నమ్మకం శాస్త్రీయమైనదేనా? అలాగే, ఆ సమయంలో ఎలాంటి పరిశుభ్రత పాటించాలి. -ఓ పాఠకురాలు
నెలసరిలో బొప్పాయి, పైనాపిల్ లాంటివి తినకూడదు అంటారు. ఈ నమ్మకం శాస్త్రీయమైనదేనా? అలాగే, ఆ సమయంలో ఎలాంటి పరిశుభ్రత పాటించాలి.
-ఓ పాఠకురాలు
మన దగ్గర నెలసరికి సంబంధించి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఆ రోజుల్లో స్నానం చేయకూడదని కొందరు, ఫలానావి తినకూడదని కొందరు చెబుతుంటారు. అవన్నీ అపోహలే. నిజానికి, నెలసరిలోనే మరింత శుభ్రంగా ఉండాలి. ఒకసారి కాదు, ఓపిక ఉంటే రెండుసార్లు స్నానం చేయవచ్చు. ప్యాడ్ మార్చుకునే ముందు, మార్చుకున్న తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవాలి. కనీసం ఎనిమిది గంటలకు ఒకసారి ప్యాడ్ మార్చుకోవాలి. కాబట్టి సాధారణ స్రావం అయ్యేవారు రోజులో గరిష్ఠంగా మూడు ప్యాడ్లు వాడితే సరిపోతుంది.
కొందరు ప్యాడ్ పూర్తిగా తడిసిపోయే దాకా మార్చరు. ఇలా చేయడం వల్ల దాని పైపొర ఎండిపోయినట్టు అవుతుంది. వ్యక్తిగత భాగాల్లో, తొడల దగ్గర రాపిడి జరిగే ప్రమాదం ఉంది. మరికొందరేమో మాటిమాటికీ మారుస్తూ.. రోజుకు అయిదారు దాకా ఉపయోగిస్తారు. ఇంత అతి కూడా అవసరం లేదు. పైగా ఇవి త్వరగా నేలలో కలిసిపోయేవి కూడా కాదు. దీనివల్ల పర్యావరణానికీ హానికరమే. కాబట్టి, మళ్లీ మళ్లీ ఉపయోగించగల ప్యాడ్లు, మెన్స్ట్రువల్ కప్‌లు కూడా మంచి ఎంపికే. అయితే ఇందుకోసం ఏం వాడినా.. స్రావం ఎక్కువైనా కాకపోయినా ఏడెనిమిది గంటలు దాటాక మార్చాల్సిందే. లేకపోతే చెడువాసన వస్తుంది. బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. ఇక నెలసరి సమయంలో బొప్పాయి, పైనాపిల్, నువ్వులు తినకూడదని చెప్పడంలో ఎలాంటి శాస్త్రీయతా లేదు.
డాక్టర్ పి. బాలాంబ సీనియర్ గైనకాలజిస్ట్
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పాల ధరల పెంపుతో స్వీట్ల ధరలకు రెక్కలు
క్యాన్సర్ మందుల తగ్గిన ధరలు అమల్లోకి
దోమల స్థావరాలను పసిగట్టే ఏఐ డ్రోన్లు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

