e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, April 18, 2021
Advertisement
Home News నోకియా దూకుడు..ఒకే రోజు 6 ఫోన్లు

నోకియా దూకుడు..ఒకే రోజు 6 ఫోన్లు

నోకియా దూకుడు..ఒకే రోజు 6 ఫోన్లు

స్మార్ట్‌ ప్రపంచంలో తన ఉనికిని చాటుకోవాలని తెగ ప్రయత్నిస్తోన్న నోకియా ఓకేసారి 6 స్మార్ట్‌ ఫోన్లతో తన దూకుడు చూపించింది. ఎంట్రీ, మిడ్‌, టాప్‌ లెవల్లో ఈ ఫోన్లని విడుదల చేసింది. వీటి ధర 7వేల నుంచి దాదాపు 35వేల దాకా ఉంది. C 10, C20 ఎంట్రీ లెవల్‌ మోడల్స్‌. G 10,G 20 మిడ్‌ రేంజ్‌. ఇక X 10, X20 టాప్‌ రేంజ్‌.

ఎంట్రీ లెవల్‌ మొబైల్స్‌ లో 1GB,2GB+16GB,32GB వేరియంట్స్‌ లో వస్తున్నాయి. వీటి ఫీచర్స్‌ చూసుకుంటే డ్యుయల్‌ సిమ్‌, 6.51 అంగుళాల హెచ్‌ డీ డిస్‌ ప్లే, ముందు-వెనక 5 మెగా పిక్సల్‌  ఎల్‌ ఈడీ  ఫ్లాష్‌ తో వస్తోంది. 5000 mAh బ్యాటరీ. వీటి ధర 7 నుంచి 8 వేల వరకు ఉంది. గ్రే, పర్పల్‌ కలర్స్‌ లో వస్తాయి.

G 10 :  డ్యుయల్‌ సిమ్‌, 6.5 అంగుళాల హెచ్‌ డీ డిస్‌ ప్లే, 4 GB +32GB,64 GB ఇంటర్నెల్‌ స్టోరేజ్‌, ట్రిపుల్‌ రియల్‌ కెమరా, 8మెగా పిక్సల్‌ సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీ. ఆండ్రాయిడ్‌ 11 మీద నడుస్తోంది.

G 20 :  సిమ్‌, 6.5 అంగుళాల హెచ్‌ డీ డిస్‌ ప్లే, 4 GB +64GB,128 GB ఇంటర్నెల్‌ స్టోరేజ్‌, 5,050mAh బ్యాటరీ, 48మెగా పిక్సల్‌ రియర్‌, 8మెగా పిక్సల్‌ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్‌ 11, గూగుల్‌ అసిస్టెంట్‌ బటన్‌ తో వస్తోంది.

X 10  :  డ్యుయల్‌ సిమ్‌, 6.67 అంగుళాల హెచ్‌ డీ డిస్‌ ప్లే,6 GB +64GB,128 GB ఇంటర్నెల్‌ స్టోరేజ్‌, 48మెగా పిక్సల్‌ రియర్‌, 8మెగా పిక్సల్‌ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్‌ 11 ( 3 ఏళ్ల వరకు అప్‌ డేట్స్‌), 4,470mAh బ్యాటరీ, 5జీ, 4జీలలో లభిస్తోంది. ఫింగర్‌ ప్రింట్‌సెన్సార్‌, గూగుల్‌ అసిస్టెంట్‌ బటన్‌ తో వస్తోంది.

X 20  :  డ్యుయల్‌ సిమ్‌, 6.67 అంగుళాల హెచ్‌ డీ డిస్‌ ప్లే,8 GB + 128 GB ఇంటర్నెల్‌ స్టోరేజ్‌, 64 మెగా పిక్సల్‌ రియర్‌, 32 మెగా పిక్సల్‌ సెల్ఫీ కెమెరా, 4,470mAh బ్యాటరీ ,ఫింగర్‌ ప్రింట్‌సెన్సార్‌, గూగుల్‌ అసిస్టెంట్‌ బటన్‌ తో వస్తోంది.  అయితే ఈ ఆరు స్మార్ట్‌ ఫోన్లు ఎప్పుడు ఇండియన్‌ మార్కెట్‌ లోకి వస్తాయన్నది నోకియా ప్రకటించలేదు.

Advertisement
నోకియా దూకుడు..ఒకే రోజు 6 ఫోన్లు

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement