ఆహార్యంలోనూ, అలంకరణలోనూ తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటూ అందరి దృష్టినీ ఆకర్షిస్తారు సెలెబ్రిటీలు. నిజానికి ఆభరణాలు, దుస్తులు.. సరికొత్త ట్రెండ్స్ ఏవైనా సరే సెలెబ్రిటీల ద్వారా పాపులర్ కావాల్సిందే. అలా ట్రెండింగ్‌లోకి వచ్చిందే.. అండర్బస్ట్ జెమ్స్ ఫ్యాషన్. అందమైన రంగు రాళ్లను, నగలను దుస్తులకు జతచేసి వాడటమే ఇక్కడి ప్రత్యేకత. ప్రియాంక చోప్రా, భూమీ పడ్నేకర్, మలైకా అరోరా వంటి బాలీవుడ్ భామలు కొన్నిసార్లు రాళ్లు లేకుండా సాదా బంగారాన్నీ ఉపయోగిస్తారు. ఇంకేముందీ.. అదే సరికొత్త ఫ్యాషన్‌గా ప్రపంచానికి పరిచయమై పోతుంది. కొంతమంది బంగారు వంకీలను, వజ్రపుటుంగరాలనూ కూడా రవిక ముడి అలంకరణకు ఉపయోగిస్తారు.