స్మార్ట్‌ఫోన్ అంటే కేవలం కాల్స్, మెసేజింగ్‌కే కాదు.. మన్నికైన పనితీరు, ఫాస్ట్ కనెక్టివిటీ, అద్భుతమైన ఫొటోగ్రఫీ అనుభవాన్ని అందించగల సామర్థ్యం ఉండాలి. ఇన్ఫినిక్స్ నోట్ 40X 5 జీ అలాంటిదే. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో ల్యాగ్ లేకుండా మల్టీటాస్కింగ్ చేయొచ్చు. 108 ఎంపీ ట్రిపుల్ ఏఐ కెమెరా ఫొటోలు తీయడాన్ని వినూత్నంగా మార్చేస్తుంది. క్వాడ్ఎల్ఈడీ ఫ్లాష్‌తో తక్కువ వెలుతురులోనూ స్పష్టమైన ఇమేజెస్ క్యాప్చర్ చేస్తుంది. 6.78 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ 120 హెచ్జడ్ డిస్ప్లే. దీనిపై స్క్రోలింగ్‌ను మరింత మృదువుగా.. విజువల్స్‌ను మరింత లైవ్‌గా చూడొచ్చు. డై మెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో డౌన్లోడింగ్, గేమింగ్, వీడియో కాలింగ్ మరింత వేగంగా ఉంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రోజంతా చార్జింగ్ టెన్షన్ లేకుండా వాడుకోవచ్చు. 18 వాట్స్ టైప్-సి ఫాస్ట్ చార్జింగ్‌తో త్వరగా చార్జ్ చేయొచ్చు. డ్యూయల్ డీటీఎస్ స్పీకర్స్.. పాటలు, వీడియోలు, గేమింగ్‌లను ఫుల్ జోష్‌గా మార్చేస్తాయి. భద్రత విషయానికి వస్తే.. సైడ్‌మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఎక్స్ఓఎస్ 14తో మరింత చక్కగా పనిచేస్తుంది. హై-పర్ఫార్మెన్స్, అత్యాధునిక ఫీచర్లు కలిగిన స్టయిలిష్ డివైస్ కోరుకునేవారికి నోట్ 40 ఎక్స్ బెస్ట్ చాయిస్!
ఇస్త్రీకి కొత్త రక్షణ
మీ బట్టలు ఇస్త్రీ చేస్తున్నప్పుడు కాలిపోతాయని భయంగా ఉందా? ఇస్త్రీ ప్లేట్ మరకలు పడి ఇబ్బంది పడుతున్నారా? అయితే బ్లూ మ్యాక్స్ యూనివర్సల్ స్టీమ్ ఐరన్ టెఫ్లాన్ షూ కవర్ మీకు సరైన పరిష్కారం. ఈ తెల్లటి టెఫ్లాన్ కవర్ ఇస్త్రీని సులభం చేస్తుంది. బట్టలను కాపాడుతుంది. ఇది ప్రతి స్టీమ్ ఇస్త్రీకి సరిపోతుంది. బట్టలు దెబ్బతినే ప్రమాదం ఉండదు. సిల్క్, ఉన్ని లాంటి సున్నితమైన బట్టలను కూడా సురక్షితంగా ఇస్త్రీ చేయొచ్చు. మీ ఖరీదైన చీరలు, షర్ట్లు ఎప్పుడూ కొత్తగా ఉంటాయి. టెఫ్లాన్ ఉపరితలం నాన్-స్టిక్‌గా ఉంటుంది. బట్టలపై సునాయాసంగా జారుతుంది. అంటుకోదు. దీంతో ఇస్త్రీ చేయడం మరింత సులభమవుతుంది. మీ బట్టలు పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. ఈ కవర్ని ఇస్త్రీపెట్టెకు అమర్చడం చాలా సులభం. ఇంట్లో ఎవరైనా సులభంగా వాడొచ్చు. ఈ కవర్ హీట్-రెసిస్టెంట్ ప్లాస్టిక్‌తో తయారైంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. రోజూ ఇస్త్రీ చేసేవారికి ఇది ఒక వరం లాంటిది.
ఎంటర్టైన్మెంట్కి ‘గ్లో’..
త్యాధునిక ఏఐ ప్రాసెసర్‌తో ఇంట్లో టీవీలను స్మార్ట్‌గా మార్చేసుకోవచ్చు. అందుకు స్మార్ట్ టీవీల విభాగంలో Vu GloQLED 43QLED25 ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. 4K QLED డిస్ప్లే… ఫుల్ బ్రైట్నెస్.. హెచ్డీఆర్ 10 & హెచ్ఎల్జీ.. సపోర్ట్‌తో అద్భుతమైన విజువల్స్ చూడొచ్చు. 178 డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్‌తో గదిలో ఎక్కడినుంచి చూసినా స్పష్టత తగ్గదు. 60 హెచ్జడ్ రిఫ్రెష్ రేట్ చక్కని విజువల్స్ అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 24 వాట్స్ డాల్బీ ఆడియో, ఆటో వాల్యూమ్ కంట్రోల్, క్రికెట్ – సినిమా మోడ్లతో సౌండ్ సిస్టమ్‌ని ఫర్ఫెక్ట్గా సెట్ చేసుకోవచ్చు. 3 HDMIపోర్టులు, HDMI2.1 గేమింగ్ కనెక్షన్, 2 యూఎస్బీ పోర్టులు, వై ఫై, క్రోమ్‌కాస్ట్, ఎయిర్‌ప్లే, 2-వే బ్లూటూత్ 5.3 వంటి కనెక్టివిటీ ఆప్షన్లతో టెక్నాలజీ ప్రియులకు చక్కని ఎంపిక. ఏఐ పిక్చర్ స్మార్ట్ సీన్ అండ్ అప్స్కేల్ టెక్నాలజీతో చిత్రాలు మరింత సహజంగా కనిపిస్తాయి. వాడుతున్న స్మార్ట్ఫోన్లతో ఇట్టే కనెక్ట్ అవుతుంది. టీవీ నుంచే వీడియో కాన్ఫెరెన్స్‌లు కూడా నిర్వహించుకునే వీలుంది. పలు రకాల సైజుల్లో ఈ టీవీలు అందుబాటులో ఉన్నాయి.
కిచెన్‌కి కొత్త తోడు..
వంటగదిలో పనులు సులభతరం చేసే ఉపకరణాలు ఎప్పుడూ ఆకర్షిస్తాయి. అలాంటిదే ఈకో మెట్రిక్స్ కిచెన్ యుటెన్సిల్ డిష్ డ్రైయింగ్ మ్యాట్. ఈ మ్యాట్‌పై కడిగిన పాత్రలను బోర్లించవచ్చు. దీంతో వాటినుంచి నీరు కారి.. ఇట్టే ఆరిపోతాయి. ఎందుకంటే ఇది మూడు పొరలతో తయారైంది. నప్పా లెదర్, స్పాంజ్, రబ్బర్ మెటీరియల్స్ కలిపి మ్యాట్‌గా మార్చారు. దీనికి రబ్బర్ బాటమ్ ఉండటంతో స్లిప్ కాకుండా చేస్తుంది. డిష్‌లు, కాఫీ మేకర్.. ఇంకా ఏ వస్తువైనా దీనిపై స్థిరంగా ఉంటుంది. నీరు కిందికి చొచ్చుకుపోదు. ఈ డ్రైయింగ్ మ్యాట్ని శుభ్రం చేయడం చాలా సులభం. త్వరగా ఆరిపోతుంది. కడగాలనుకుంటే చల్లని నీటితో శుభ్రం చేస్తే చాలు. దీన్ని పలు రకాలుగా వాడొచ్చు. కాఫీ బార్ మ్యాట్గానూ ఉపయోగించొచ్చు. డిష్‌లు ఆరబెట్టడానికీ బాగుంటుంది. పెట్స్ కోసం కూడా వాడొచ్చు. దీనికి నీరు పీల్చే గుణం అద్భుతం. ఈ మ్యాట్ డిజైన్ చాలా స్టయిలిష్‌గా ఉంటుంది. ఏ కిచెన్కైనా సరిపోతుంది. మీ వంటగది శుభ్రంగా, అందంగా ఉండాలనుకుంటే.. ఈ మ్యాట్‌ను ఒక్కసారి ట్రై చేయండి.