ఒకేచోట కూర్చుని వర్క్ చేయాలన్నా.. గదిలో ఒకే మూలలో సెటిలవ్వాలన్నా.. నేటి తరానికి బోర్. ఎక్కడంటే అక్కడ కూర్చుని ఫోకస్‌గా పని చేసేసుకుంటున్నారు.. అలాంటివారి కోసమే ఈ ‘పోర్టబుల్ ల్యాప్‌టాప్ డెస్క్’. దీన్ని హాయిగా ఒడిలో పెట్టుకుని ల్యాపీ, ట్యాబ్‌లతో పని చేసుకోవచ్చు. ఒడిలో ఒత్తుకుపోకుండా కింద కుషన్‌ని ఏర్పాటుచేశారు. ఓ దిండును హత్తుకున్నట్టే ఉంటుందన్నమాట. దీంట్లో మరో ప్రత్యేకత ఏంటంటే.. బిల్ట్ ఇన్ మౌస్‌ప్యాడ్! దీంతో చేతికి ఎలాంటి అసౌకర్యం లేకుండా మౌస్‌ని వాడొచ్చు. చిత్రంలో మాదిరిగా టైపింగ్ చేసే క్రమంలో చేతి మణికట్టు దగ్గర ఒత్తిడి తగలకుండా కుషన్ ఏర్పాటుచేశారు. ఒకవేళ మీరు ట్యాబ్‌తో వర్క్ చేసుకోవాల్సి వస్తే.. దాన్ని అమర్చేందుకు ప్రత్యేక స్లాట్ ఉంది. ఇంట్లోనే కాదు.. మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా దీన్ని సౌకర్యంగా వాడుకోవచ్చు. సూట్‌కేస్ బ్యాగులా ఎక్కడికైనా సులభంగా పట్టుకెళ్లొచ్చు.
ధర: రూ. 2,499
దొరికే చోటు: https://rb.gy/bgwccl
యాపిల్ బుజ్జి డెస్క్‌టాప్
ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఉత్పత్తులంటే అందరికీ క్రేజీనే. వాటి డిజైన్‌లో ఉన్న సొగసు అలాంటిది. అలాంటి యాపిల్ సంస్థ అతి చిన్న డెస్క్‌టాప్ కంప్యూటర్ని అందుబాటులోకి తెస్తున్నది. మ్యాక్ మినీ వినియోగదారులకు సుపరిచితమే. దాన్నే ఇప్పుడు సరికొత్తగా ‘ఎం4 మ్యాక్ మినీ’గా నామకరణం చేసింది. రెండు వెర్షన్లలో దీన్ని మార్కెట్లోకి తెస్తున్నది. ఎం4, ఎం4 ప్రో చిప్ సెట్‌తో వీటిని డిజైన్ చేశారు. మ్యాక్ వెనక భాగంలో మూడు యూఎస్బీ టైప్ సీ పోర్ట్‌లు, పవర్ కేబుల్, ఓహెచ్డీఏంఐ పోర్ట్ ఉండేలా దీన్ని డిజైన్ చేశారు. త్వరలోనే ఇవి మార్కెట్లోకి రానున్నాయి.
ధర: రూ. 59,900
కంటెంట్ ఉన్న స్టాండ్
ప్రతి ఒక్కరూ ఏదో ఒక కంటెంట్ చేస్తున్నారు. పలు ప్లాట్ఫామ్ల్లో షేర్ చేసి సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లుగా కెరీర్ స్టార్ట్ చేస్తున్నారు. మీరు కూడా ఇదే పనిలో ఉన్నారా? అయితే, మీ కోసమే డిజైన్ చేసిన ఫోన్ స్టాండ్ ఇది. ఈ మల్టీ ఫంక్షనల్ ఫోన్ స్టాండ్ ఆన్లైన్ అంగళ్లలో అందుబాటులో ఉంది. దీన్ని ఎలా కావాలంటే అలా సెట్ చేసుకుని ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు. దీంట్లో ఉన్న లైట్‌తో వీడియోలు క్రిస్టల్ క్లియర్‌గా వస్తాయి. 7 రకాలుగా లైటింగ్ సెట్ చేసుకునే వీలుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 12 గంటల వరకూ వెలుగులు ప్రసరిస్తాయి. దీంట్లో ఏర్పాటుచేసిన క్లాంప్‌తో ఫోన్‌ను 360 డిగ్రీల కోణంలో ఎటైనా తిప్పుకోవచ్చు. మీకు మీరుగానే వీడియోలు చిత్రీకరించేందుకు ప్రత్యేక రిమోట్ ఉంది. 10 మీటర్ల దూరం నుంచి కూడా దీన్ని వాడుకోవచ్చు.
ధర: రూ. 4,299
దొరికే చోటు: https://rb.gy/q8vnej
బాటిల్ కాదు.. బ్లెండర్!
ఉరుకుల పరుగుల జీవితమే అయినా.. ఆరోగ్యం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అప్పుడే.. చదువులో అయినా, కొలువులో అయినా కాంపిటిషన్ని నెగ్గుకు రాగలం. అందుకు స్మార్ట్‌గా ఆలోచించాలి. మీరు కూడా స్మార్ట్ లైఫ్‌స్టయిల్‌కి సిద్ధం అయితే ఈ ‘పోర్టబుల్ స్మూతీ బ్లెండర్’ మీకోసమే. ఎప్పుడైనా.. ఎక్కడైనా దీంతో జూస్ చేసుకుని తాగొచ్చు. స్మూతీస్, మిల్క్షేక్స్కి ఇది ప్రత్యేకం. ఇంట్లోనే ఫ్రూట్స్ కట్ చేసి దీంట్లో వేసుకుని.. వాటర్ బాటిల్ మాదిరిగా తీసుకెళ్లొచ్చు. బ్రేక్‌లో జూస్ తాగుదాం అనుకుంటే ట్యాగ్ పైన ఉన్న బటన్ని రెండుసార్లు నొక్కితే చాలు. పదునైన బ్లేడ్లతో మిక్స్ కొట్టేసి క్షణాల్లో జూస్ రెడీ చేసేస్తుంది. వెంటనే తాగడం ద్వారా అందులోని పోషకాలు శరీరానికి చక్కగా అందుతాయి. ఈ బ్లెండర్ని యూఎస్బీ పోర్ట్‌తో చార్జ్ చేయొచ్చు. బాటిల్ సామర్థ్యం 340 ఎంఎల్. మామూలు బ్లెండర్ల మాదిరిగానే దీన్నీ వాష్ చేసుకోవచ్చు.
ధర: రూ. 1,999
దొరుకే చోటు: https://rb.gy/8wcbed