Better Lifestyle | మన జీవనశైలి మన ఆరోగ్యానికి మూల కారణం. మనం ఎలా ప్రవర్తిస్తాం.. ఏ ఆహారాలు తీసుకుంటాం.. ఎలాంటి జీవనశైలిని అలవర్చుకుంటున్నాం.. ఇలా ఇవన్నీ మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలే. ఆధునిక జీవనశైలి కారణంగా నిత్య జీవితంలో ఎన్నో వ్యాధులకు, ఆరోగ్య సమస్యలకు గురవుతున్నాం. లైఫ్‌స్టైల్‌ను మార్చుకోకపోతే ప్రాణాంతక జబ్బులు కూడా వెంటాడుతాయని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. అందుకు మన జీవనశైలిలో మార్పులతో పాటు కొన్ని అద్భుత పానీయాలను కూడా మన డైట్లో చేర్చుకోవడం చాలా అవసరం.
అదనంగా విటమిన్లు, ఖనిజాలతో కూడిన ఆరోగ్యకరమైన పానీయాలను కనుగొనడం కష్టమైన పనే. చాలా దుకాణాలు సాధారణంగా పోషక విలువలు లేని, క్యాలరీలను కలిగి ఉన్న పానీయాలను మనకు అమ్ముతున్నాయి. సాధారణ నీటితో దాహం తీర్చుకోవాలనుకుంటే ఎలాంటి సందేహం వద్దు. అందోళన అసలే వద్దు. ప్రకృతి ప్రసాదించిన పానీయాలను మన డైట్లో భాగం చేసుకోవడం ద్వారా మనం నిత్యం ఆరోగ్యంగా ఉండొచ్చు.

ఆరోగ్యకరమైన, అత్యంత పోషకాలు కలిగిన పానీయాల్లో 100% స్వచ్ఛమైన దానిమ్మ రసం ఒకటి. ఈ జ్యూస్ యాంటీ ఆక్సిడెంట్స్‌తో లోడ్ చేయబడి ఉంటుంది. ఇది కణాలను దెబ్బతినకుండా, కడుపులో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. వీటితోపాటు కొన్ని రకాల ఆర్థరైటిస్‌ను తగ్గించడంలో గ్రేట్‌గా ఉపయోగడపడతాయి. రోగనిరోధక వ్యవస్థను బలపరిచే విటమిన్ సీ ఈ జ్యూస్‌లో అధికంగా ఉన్నందున.. జలుబును నివారించడానికి గొప్ప పానీయంగా ఉన్నది.

దుంపలను ఆహారంలో రెగ్యులర్‌గా భాగం చేసుకోవాలి. దుంపల్లో ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అనేక పోషకాలు ఉన్నాయి. వాటిలో మొదటిది ఫోలిక్ యాసిడ్. రెండోది మెగ్నీషియం. మూడోది నైట్రేట్లు. మన శరీరంలో నైట్రేట్లు నైట్రిక్ ఆక్సైడ్‌గా మార్చబడి రక్తపోటును నివారించడంలో, రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వ్యాయామం చేసే ముందు దీన్ని తీసుకోవడం ద్వారా అద్భుతమైన ఉపయోగాలు పొందవచ్చు.

ఎలాంటి కలుషితంలేని, స్వచ్ఛమైన పానీయంగా మనం కొబ్బరి నీరును చెప్పుకోవచ్చు. ఎన్నో పోషకాలుండే ఈ పానీయంలో శరీరాన్ని రీహైడ్రేట్ చేయగల సామర్థ్యాన్ని ఉంటుంది. ఊహించని విధంగా అధిక స్థాయి పొటాషియంను సరఫరా చేసి గుండెను సాధారణంగా కొట్టుకోవడంలో సహాయపడుతుంది. అలాగే రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఈ జ్యూస్ యాంటీఆక్సిడెంట్లతో లోడ్ చేయబడి ఉండి హృదయ సంబంధ వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సాయపడుతుంది. అలాగే మూత్ర వ్యవస్థ సాఫీగా పనిచేసేలా సహకరిస్తుంది. క్రాన్బెర్రీ జ్యూస్ పుల్లని రుచిని కలిగి ఉండటంతో రుచి కోసం చక్కెరలను వాడుతుంటారు. అలా కృత్రిమ చక్కెరలు కాకుండా ఖర్జూరం, తేనెలను వాడటం శ్రేయస్కరం.

తాజా నారింజ రసం మనకు అందుబాటులో ఉన్న ఆరోగ్యకరమైన పానీయాలలో ఒకటి. ఇది అన్ని దుకాణాల్లో కనిపించే అత్యంత సాధారణ రకం రసం. విటమిన్ సీ కలిగి ఉండి ఎముకలు, దంతాలు బలంగా ఉండటంలో, వ్యాధినిరోధక వ్యవస్థ బలంగా తయారవడంలో సహకరిస్తుంది.ఈ పానీయంలో పొటాషియం, థయామిన్‌తో పాటు కాల్షియం, డీ విటమిన్ కూడా ఉండి మనకు ఆరోగ్యాన్నిస్తాయి.