వేడివేడి నురగలు కక్కే కాఫీ గొంతు దాటనిదే చాలామందికి రోజు ప్రారంభం కాదు. కొందరికైతే గంటకోసారి కాఫీరాగం పలక్కపోతే విసుగు పుడుతుంది. మెదడును ఉత్తేజపరచడంలో కాఫీ ఔషధంగా పనిచేస్తుంది. ఉదయాన్నే ఫిల్టర్ కాఫీ, మధ్యాహ్నానికి ఇన్స్టంట్ కాఫీ, సాయంత్రం మోచా కాఫీ ఇలా విడతల వారీగా రకరకాల కాఫీలు టేస్ట్ చేస్తుంటారు. ఈ రకాల్లో ఒకటి మష్రూమ్ కాఫీ. పుట్టగొడుగును ఎక్కువగా కూరలు, పిజ్జాల్లో సీజనింగ్గా వాడతారని తెలిసిందే. కానీ వీటితో చేసే కాఫీ కూడా చాలా ప్రత్యేకం. దీంతో పలు ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి.