బడ్జెట్లోనే ఫ్లాగ్షిప్ ఫీచర్లు కావాలా? అయితే, ‘మోటరోలా ఎడ్జ్ 70’ స్మార్ట్‌ఫోన్‌పై ఓ లుక్కేయండి. ఆధునిక ఫీచర్లు, సేఫ్టీతోపాటు బడ్జెట్‌కు పెద్దపీట వేస్తూ.. ఎడ్జ్ 70 మోడల్‌ను తీసుకొచ్చింది మోటరోలా సంస్థ. ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లో 6.7 అంగుళాల సూపర్ హెచ్డీ AMOLED డిస్ప్లేను ఏర్పాటు చేశారు. 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తోపాటు 120 Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్ అందిస్తుందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
మిడ్ సెగ్మెంట్ ఫోన్ అయినప్పటికీ మన్నికకు ప్రాధాన్యమిస్తూ.. ఐపీ 69 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌తోపాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐతో రక్షణ కల్పిస్తున్నారు. ‘ల్యాగ్’ అనే మాటే నచ్చని నవతరం కోసం.. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ ఏర్పాటుచేశారు.
చేసినా, గేమ్స్ ఆడినా.. ల్యాగ్ ఉండదు. 256 జీబీ స్టోరేజీ కలిగి ఉంది. ఇక 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ.. రోజంతా వస్తుంది. 68 వాట్స్ చార్జింగ్ సపోర్ట్‌తోపాటు 15 వాట్స్ వైర్లెస్ చార్జింగ్ కూడా అందిస్తుంది. ఫొటోగ్రఫీ కోసం జెన్-జీని ఆకట్టుకునే కెమెరా సెటప్ చేశారు. 50 ఎంపీ మెయిన్ కెమెరాతోపాటు 50 ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి.
సెల్ఫీలు, వ్లాగ్‌ల కోసం.. 50 ఎంపీ ఫ్రంట్ కెమెరాను ఏర్పాటుచేశారు. 4కె 60ఎఫ్‌పీఎస్‌తో వీడియోలు రికార్డింగ్ చేసుకోవచ్చు. అత్యాధునిక ‘ఏఐ’ని వాడేవారి కోసం.. మోటో ఏఐ 2.0, గూగుల్ జెమిని, కోపైలట్, పెర్ప్లెక్సిటికీ సపోర్ట్ ఇస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత హలో యూఐపై పనిచేసే ఈ ఫోన్.. 29,999 ధరకు ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో త్వరలోనే అందుబాటులోకి రానున్నది.