మోటోరోలా నుంచి కొత్త ఫోన్ వచ్చేసింది! అదే మోటోరోలా ఎడ్జ్ 60. ఈ ఫోన్ లుక్ సూపర్ కూల్. అంతేనా.. కెమెరా అదిరిపోతుంది. స్పీడ్ గురించి చెప్పాలంటే టాప్ క్లాస్. గత ఏడాది ఎడ్జ్ 50 బాగా హిట్ అయింది కదా.. దానికి కొనసాగింపుగా ఇప్పుడు ఈ ఎడ్జ్ 60 కూడా అదే రేంజ్లో మార్కెట్లోకి వచ్చేసింది. ఈ సిరీస్‌లో ఇంకా ఎడ్జ్ 60 ప్రో, ైస్టెలస్, ఫ్యూజన్ లాంటి మోడల్స్ కూడా ఉన్నాయి. స్క్రీన్ సైజు 6.67 అంగుళాలు. ఫొటోలు క్లిక్ చేయడం ఇష్టమా? అయితే, ఈ ఫోన్లో 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
ఫొటోలు క్లియర్‌గా, బ్రైట్‌గా వస్తాయి. సెల్ఫీలు తీసుకోవడానికి కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇక ఫోన్ స్పీడ్ గురించి చెప్పాలంటే, లేటెస్ట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్ ఉంది. గేమ్స్ ఆడినా, యాప్స్ ఓపెన్ చేసినా ఫోన్ స్లో అవ్వదు. బ్యాటరీ కూడా ఫుల్ డే సపోర్ట్ చేస్తుంది.
ఒకసారి చార్జ్ చేస్తే రోజంతా టెన్షన్ లేదు. ఇంకా చెప్పాలంటే.. మోటో AI ఫీచర్ ఉంది. ఇది మీ ఫోన్‌ని స్మార్ట్‌గా మార్చి, పనులు క్విక్‌గా చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. ైస్టెలిష్ లుక్, అదిరే కెమెరా, సూపర్ స్పీడ్ అన్నీ కావాలంటే మోటోరోలా ఎడ్జ్ 60ని ట్రై చేయొచ్చు. ఇంతకీ దీని ధర ఎంతో తెలుసా? రూ. 25,999 మాత్రమే!