ఎప్పటికప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ని అడాప్ట్ చేసుకుంటూ యూజర్ల కోసం వాట్సాప్ సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్నది. వాటిలో ‘ఏఐ’ ఆధారిత ఫీచర్ల గురంచి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సరికొత్తగా రెండు ఏఐ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. అందులో ఒకటి ఏఐ ఆధారిత మెసేజ్ సమ్మరైజేషన్. ఎప్పుడైనా ఎక్కువ సంఖ్యలో మెసేజ్‌లు వస్తే, ఒక్కొక్కటి స్క్రోల్ చేస్తూ చూడటం కష్టమే! ఈ సమస్యకు పరిష్కారమే సమ్మరైజ్ విత్ మెటా ఏఐ (Summarise with Meta AI) బటన్.
యూజర్ పెద్దసంఖ్యలో మెసేజ్‌లు అందుకున్నప్పుడు ఈ బటన్ ప్రత్యక్షమవుతుంది. క్లిక్ చేస్తే, ఏఐ క్విక్ సమ్మరీ తయారుచేస్తుంది. గ్రూప్ చాట్లు, బ్రాడ్కాస్ట్ చానెల్స్ లాంటి హెవీ చాట్ వాల్యూమ్ ఉన్న సందర్భాల్లో ఇది ఉపయోగపడుతుంది. ఇక రెండోది ఏఐ వాల్‌పేపర్ క్రియేటర్. మీరు మీ చాట్‌కి బ్యాక్‌డ్రాప్ మార్చాలంటే.. ఇక గూగుల్ సెర్చ్ అవసరం లేదు. వాల్‌పేపర్ సెట్టింగ్స్‌లో క్రియేట్ విత్ ఏఐ (Create with AI) ఆప్షన్ని ఎంచుకోవచ్చు. ఇందులో మీరు వర్ణించిన సీన్ ఆధారంగా మెటా ఏఐ వాల్‌పేపర్ క్రియేట్ చేస్తుంది. ఈ కొత్త ఫీచర్లు ప్రస్తుతం వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లో అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.