అనేక మంది మహిళలు తాము అందంగా కనిపించేందుకు సౌందర్య సాధనాలు విరివిగా వాడుతుంటారు. అందులో ప్రధానంగా వివిధ రకాల లిప్‌స్టిక్‌లతో తమ పెదాలను అలంకరించుకుంటారు. కానీ కొన్ని లిప్‌స్టిక్‌లు వాడటం వల్ల నెలసరి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు. కొన్ని హార్మోన్లను దెబ్బతీసే రసాయనాలను కలిగి ఉంటాయని చెబుతున్నారు. లిప్‌స్టిక్ ప్యాకేజింగ్‌లో కనిపించే బిస్ ఫినాల్ ఏ (బీపీఏ) కెమికల్ ఈస్ట్రోజెన్‌ను అనుకరించి మహిళల శరీరంలోని హార్మోన్లను గందరగోళంగా మారుస్తుందట. మెతిల్ ప్యారాబెస్, ప్రొపిల్ ప్యారాబెస్ అనే రెండు పదార్థాలు మహిళల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని పలు అధ్యయనాల్లో తేలింది.
లిప్‌స్టిక్ ప్యాకెట్ మీద అలాంటి పదార్థాలు ఉపయోగించినట్టు కనిపిస్తే వాటిని కొనుగోలు చేయొద్దని సూచిస్తున్నారు. పరాబెన్-ఫ్రీ, బీపీఏ-ఫ్రీ అని రాసి ఉన్న లిప్‌స్టిక్‌లను వాడటమే మంచిదని చెబుతున్నారు. మరోవైపు విటమిన్ ఈ, స్కాలిన్, నేచురల్ ఆయిల్స్‌తో కూడిన హైడ్రేటింగ్ పదార్థాలు ఉండే లిప్స్టిక్స్ సురక్షితమైనవిగా, లెడ్, కాడ్మియం లాంటి లోహాలు కలిగినవి ఆరోగ్యానికి హానికరమని పలువురు డెర్మటాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.