చీరకట్టుతో కనికట్టు చేసే సౌందర్యం కొందరిదైతే.. చుడీదార్లో షాన్‌దార్ అనిపిస్తారు మరికొందరు. మలైకా ఆరోరా లాంటి సొగసుగత్తె ఏ ఆహార్యంలో అయినా ‘ఔరా!’ అనిపిస్తుంది. ఈ బాలీవుడ్ భామ తాజాగా తెల్లని వేస్ట్కోట్ ధరించి తళుకులీనింది.
వంగపువ్వు రంగు హ్యాండ్‌బ్యాగ్ చేతబూని విలాసంగా కూర్చున్న ఈ భంగిమను చూస్తే.. దేవదాసు కూడా కాళిదాసై కావ్యం రాసేస్తాడేమో!!