ప్రేమలో ఉన్నప్పుడు.. సమయమంతా సంతోషంగా సాగిపోతుంది. చాటింగులు-డేటింగులు, ముద్దులు-ముచ్చట్లు, సినిమాలు-షికార్లు అంటూ.. ఆకాశమే హద్దుగా పరుగులు పెడుతుంది. మరి బ్రేకప్ అయితే.. కాలం ఒక్కసారిగా ఆగిపోతుంది. మనసు ముక్కలై.. కుంగుబాటు ఆవహిస్తుంది. అయితే, ఆ బాధ నుంచి బయటపడితే.. తర్వాతి జీవితం మరింత మధురంగా ఉంటుంది. బ్రేకప్ అయినా.. బేఫికర్‌గా బతికే ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది.
అందుకే.. బ్రేకప్ అయ్యిందని బాధలో మునిగిపోకండి. గోడకు కొట్టిన బంతిలా.. తిరిగి పుంజుకోండి. బంగారంలాంటి భవిష్యత్తును నిర్మించుకోండి.