ప్రపంచంలో ఏం జరుగుతున్నది? అనే ఆసక్తి కంటే.. మన చుట్టూ ఏం అవుతున్నదో తెలుసుకోవడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తాం. అందుకే ‘లోకల్’ ఈవెంట్స్‌కి అంత ప్రాధాన్యం ఇస్తున్నాయి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్. ప్రాంతీయ వార్తలతో కొన్ని యాప్‌లే అందుబాటులోకి వచ్చాయంటే లోకల్ పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఫేస్బుక్ కూడా మరో అడుగు ముందుకేసి ప్రత్యేకంగా ‘లోకల్ ట్యాబ్’ని పరిచయం చేసేందుకు సిద్ధం అవుతున్నది. ట్యాబ్‌లో మనం ఉన్న ప్రాంతంలో చోటు చేసుకునే ఈవెంట్స్, ఇతర ముఖ్యమైన అప్డేట్స్ అన్నిటినీ చూపిస్తుంది.
ప్రముఖమైన గ్రూప్స్, ముఖ్యమైన నాయకులు, బిజినెస్ అప్డేట్స్, అమ్మకాలకు సంబంధించిన వివరాల్ని చూడొచ్చు. రాబోయే వారంలో ఏవైనా ఈవెంట్స్ ఉంటే అలెర్ట్స్ కూడా వస్తాయి. దీంతో ఈ ‘లోకల్ ట్యాబ్’తో మీరున్న ప్రాంతంలో ఏం జరుగుతుందో ఇట్టే తెలుసుకోవచ్చు. మరో విషయం ఏంటంటే.. ఫేస్బుక్ ‘ఎక్స్ప్లోర్ ట్యాబ్’ పేరుతో మరోటి రానుంది. దాంట్లో మీ ఆసక్తుల మేరకే కంటెంట్ కనిపించేలా ఏర్పాటు చేస్తున్నారు. అంతే.. మీరు ఫేస్బుక్లో ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు అనే ట్రాకింగ్ ఆధారంగా ఈ ఎక్స్ప్లోర్ ట్యాబ్ పనిచేస్తుంది. యూజర్ సెంట్రిక్‌గా కావాల్సిన కంటెంట్ మాత్రమే అందించేలా ఏఐతో ముందుకొస్తున్నది ఫేస్బుక్. అలాగే, వీడియోలను కూడా నచ్చినట్టుగా చూసేందుకు ‘వీడియో ట్యాబ్’ రానుంది. వీడియో నిడివి ఆధారంగా ఒకే ట్యాబ్‌లో అన్నిటినీ ఆర్గనైజ్ చేసుకోవచ్చు.