స్మార్ట్ఫోన్లలో ఐ-ఫోన్ వజ్రం వంటిదని కొందరి నమ్మకం. దీనికి వజ్రాల తొడుగు తోడైతే ఎంత ముచ్చటగా ఉంటుందో చూశారుగా! ఐ-ఫోన్ 4ఎస్ ఎలైట్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫోన్లలో ఒకటి. బంగారపు కవచం చేసి, దానిపై 100 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 500 వజ్రాలు పొదిగారు. 24 క్యారెట్ల బంగారంతో చేసిన యాపిల్ లోగోపైనే 53 వజ్రాలు పొందుపరిచారు. మెయిన్ నేవిగేషన్ను 8.6 క్యారెట్ వజ్రంతో మలిచారు.
ఇక ఈ వజ్ర ఖచితమైన ఫోన్ను భద్రపర్చడానికి చక్కటి పెట్టెనూ తయారుచేశారు. డైనోసర్ ఎముకతో తీర్చిదిద్దిన ఈ పెట్టెను గోల్డ్ కవర్తో మలిచారు. దీనిపై విలువైన రంగు రాళ్లు పొదిగి ఫోన్కు తగ్గ కేస్గా తీర్చిదిద్దారు. ఈ ఐ-ఫోన్ ధర సుమారు రూ.74.89 కోట్లు. ఇప్పటికే విశ్వకుబేరుల చేతుల్లో హల్చల్ చేస్తున్నట్టు సమాచారం.