పరిష్వంగాల్లో తేలిపోండి
అలసిన మనసుకు మంచిమాట సాంత్వనను ఇస్తుంది. అదే బడలిన శరీరానికి కౌగిలింత కన్నా గొప్ప ఉపశమనం లేదంటున్నారు ప్రాజ్ఞులు. హద్దుల్లేని హగ్గిస్తే నాలుగు పెగ్గులు వేసుకున్నంత కిక్ వస్తుందట పురుషుడికి. శ్రీవారి ఆత్మీయ కౌగిలింత శ్రీమతికి మతిపోగొడుతుందట.
అలసిన మనసుకు మంచిమాట సాంత్వనను ఇస్తుంది. అదే బడలిన శరీరానికి కౌగిలింత కన్నా గొప్ప ఉపశమనం లేదంటున్నారు ప్రాజ్ఞులు. హద్దుల్లేని హగ్గిస్తే నాలుగు పెగ్గులు వేసుకున్నంత కిక్ వస్తుందట పురుషుడికి. శ్రీవారి ఆత్మీయ కౌగిలింత శ్రీమతికి మతిపోగొడుతుందట. అంతేకాదు.. రేయంతా ఒకరి కౌగిట్లో మరొకరు తనువు దాచుకుంటే.. శారీరక, మానసిక సమస్యలు కరిగిపోతాయని నిపుణుల మాట. జీవిత భాగస్వామిని కౌగిలించుకుని పడుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని వాళ్లు చెబుతున్నారు.
ఆలుమగలు గాఢంగా హత్తుకొని నిద్రిస్తే ఉభయుల శరీరంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల అవుతుందట. ఫలితంగా ఆరోగ్యం మెరుగవుతుంది. అంతేకాదు… ఒకరినొకరు ఒత్తిగిలి పడుకున్నప్పుడు రేగే వెచ్చని నిట్టూర్పులు నిద్రాదేవిని ఆవాహన చేస్తాయట.
ఆవిడగారి ఒంపుల వైఖరిలో ఇమిడిపోతూ ఒద్దికగా ఈయనగారు జరిగేకొద్దీ మైండ్ రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లిపోతుందట. ఈ కౌగిలింతలో వింత వింత భంగిమలు ప్రయత్నించిన వారికి బోనస్‌గా గుండె లయబద్ధంగా ఆడుతుందట. రక్తపోటు నియంత్రణలో ఉంటుందట. ప్రేమను, అభిమానాన్ని వ్యక్తపరచడానికి ఇచ్చిపుచ్చుకునే ఆలింగనంతో ఎన్ని లాభాలు ఉన్నాయో చదివారుగా! ఇంకేం.. పరిష్వం‘గాల్లో’ తేలిపోండి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

