అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. అందుకోసం ఏవేవో సౌందర్య ఉత్పత్తులు వాడుతుంటారు. కానీ, రసాయనాలు కలిసిన ఉత్పత్తులు కొందరిలో సైడ్ఎఫెక్ట్స్ చూపిస్తాయి. చర్మానికి హాని కలిగిస్తాయి. ఈ సమస్యకు ‘జేడ్ రోలర్’ మంచి పరిష్కారం చూపుతుందని అంటున్నారు సౌందర్య నిపుణులు. చర్మాన్ని సహజసిద్ధంగా మెరిపించడంలో ఇది సమర్థంగా పనిచేస్తుందని చెబుతున్నారు.
చైనాలో ఎంతో పాపులర్ అయిన జేడ్ రోలర్.. ఇప్పుడిప్పుడే మన దగ్గరా ప్రాచుర్యం పొందుతున్నది. కేవలం మసాజ్ ద్వారానే అందాన్ని రెట్టింపు చేస్తుంది. చర్మాన్ని రిలాక్స్‌గా మార్చడంతోపాటు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది.
జేడ్ రోలర్‌తో ముఖంపై రెగ్యులర్‌గా మసాజ్ చేసుకుంటే.. చర్మంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఫలితంగా ముఖంలోని మూలమూలలకూ ఆక్సిజన్ అంది.. చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది. ముఖంపై మచ్చలు తగ్గి.. ప్రకాశవంతంగా మెరుస్తుంది.
చర్మం పోషకాలను గ్రహించడంలో సాయపడటంతోపాటు చర్మ సమస్యలనూ తగ్గిస్తుంది. మాయిశ్చరైజర్లు, సీరమ్స్ వంటివి ఉపయోగించే సమయంలో జేడ్ రోలర్‌ను వాడినట్లయితే.. ఆయా ఉత్పత్తులు మరింత సమర్థంగా పనిచేస్తాయి.
ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. స్కిన్ కేర్ కోసం రెగ్యులర్‌గా వాడే ఆయిల్, సీరమ్, మాయిశ్చరైజర్ వంటివి ముఖానికి అప్లయి చేయాలి. ఆ తర్వాత జేడ్ రోలర్‌ను తీసుకొని.. చర్మంపై పైకి – కిందికి తిప్పుతూ సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. అయితే.. చర్మం సున్నితంగా ఉన్నవారు కొంచెం మృదువుగానే మసాజ్ చేసుకోవాలి. కనుబొమలు, కళ్ల కింద జేడ్ రోలర్‌ను అప్లయి చేయకపోవడమే మంచిది. జేడ్ రోలర్ వాడకం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.