కనిపించిన ప్రతి ఆహారపదార్థాన్ని ఫ్రిజ్‌లో పెట్టేయడం చాలామంది అలవాటు. పాలు, కూరగాయల నుంచి మొదలుపెడితే, చట్నీల దాకా అన్నింటినీ అందులోనే పెట్టేస్తుంటారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. పాడవ్వకూడదని కొన్ని ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉంటాయట. మరి వేటిని ఫ్రిజ్‌లో పెట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
మామిడి పండ్లను నేరుగా ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఒకవేళ మామిడి పండ్లను ఫ్రిజ్‌లో పెట్టాలని అనుకుంటే ముందుగా వాటిని కట్ చేసి కాసేపు నీళల్లో నానబెట్టాలి. ఆ తర్వాత అందులో నుంచి తీసి కాసేపు పక్కన ఉంచాలి. ఆ తర్వాత ఫ్రిజ్‌లో పెట్టాలి.
మామిడి పండ్లను ఎప్పుడూ ఓపెన్‌గా ఫ్రిజ్‌లో పెట్టకూడదు. మామిడి పండు ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకుని వాటిపై మూతపెట్టి ఫ్రిజ్‌లో ఉంచడం మంచిది.
కొంతమందికి చల్లటి పుచ్చకాయ తినడం ఇష్టం. ఇందుకోసం కట్ చేసిన ముక్కలను ఫ్రిజ్‌లో పెడుతుంటారు. ఇలా చేస్తే దానిలోని యాంటీ ఆక్సిడెంట్లు తగ్గిపోతాయి. తియ్యగా ఉండాల్సిన వాటర్ మిలాన్ కాస్త చప్పగా మారిపోతుంది.
త్వరగా పాడైపోతుందేమోనని బ్రెడ్‌ను కూడా ఫ్రిజ్‌లో పెడుతుంటారు. కానీ బ్రెడ్‌ను ఫ్రిజ్‌లో పెడితే అది త్వరగా గట్టిగా మారుతుంది. టేస్ట్ కూడా పోతుంది. ఎక్కువ రోజులు అలాగే ఫ్రిజ్‌లో పెడితే బూజు పట్టే అవకాశం కూడా ఉంది.
టమాటాలను ఫ్రిజ్‌లో పెడితే వాటి మీద ఉండే పలుచటి పొర ముడతలు పడిపోయి.. అందులోని విటమిన్ సి తగ్గిపోతుంది. అలాగే టమాటాల రుచి కూడా పోతుంది. అందుకే టమాటాలను ఫ్రిజ్‌లో ఉంచకూడదు. వీలైనంత వరకు గాలి తగిలే ప్రదేశంలోనే ఉంచాలి.
టమాటాలను ఫ్రిజ్‌లో పెడితే వాటి మీద ఉండే పలుచటి పొర ముడతలు పడిపోయి.. అందులోని విటమిన్ సి తగ్గిపోతుంది. అలాగే టమాటాల రుచి కూడా పోతుంది. అందుకే టమాటాలను ఫ్రిజ్‌లో ఉంచకూడదు. వీలైనంత వరకు గాలి తగిలే ప్రదేశంలోనే ఉంచాలి.
తేనెను ఫ్రిజ్‌లో పెడితే తొందరగా చిక్కబడి గట్టిగా తయారవుతుంది. వాడుకోవడానికి అనువుగా ఉండదు. కొంతమంది నూనెలను కూడా ఫ్రిజ్‌లో పెడుతుంటారు. వాటిని గది ఉష్ణోగ్రత వద్దే ఉంచాలి. కాఫీ పౌడర్‌ను కూడా ఫ్రిజ్‌లో పెడితే రుచి పోతుంది.
ఆలుగడ్డలను ఫ్రిజ్‌లో ఉంచినప్పుడు వాటిపై తొక్కలోని తేమ ఆవిరై గట్టిపడుతుంది. దీనివల్ల ముక్కలు తరగడం కష్టమవుతుంది. అలాగే లోపలి పిండి పదార్థం కూడా తేమను పూర్తిగా కోల్పోతుంది. పైగా పిండి పదార్థంలో చక్కెర శాతం త్వరగా పెరిగే అవకాశం ఉంది.
దోసకాయలను కట్ చేశాక ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల అందులోని పోషకాలు తగ్గిపోతాయి. కాబట్టి ఫ్రిజ్‌లో పెట్టిన దోసకాయ ముక్కలను తినడానికి బదులు.. చలవ చేసేందుకు కంటిపై రుద్దుకునేందుకు మాత్రమే వాడండి
మునక్కాయలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల కొయ్య ముక్కల్లా తయారవుతాయి. కాబట్టి వీటిని గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడమే ఉత్తమం.
పుదీనా ఆకులను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల నల్లగా మారుతుంది. అలాంటి ఆకులను వంటల్లో ఉపయోగిస్తే ఆహారం విషతుల్యంగా మారుతుంది.
చట్నీలు, తొక్కులను కూడా చాలామంది ఫ్రిజ్‌లో పెడుతూనే ఉంటారు. సూర్యకాంతి పడకుండా ఉంటే తొక్కులను రెండు మూడేళ్ల పాటు నిల్వ చేయవచ్చు. అయితే వాటిని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అందులోని చల్లటి ఉష్ణోగ్రతలకు తొక్కులు తొందరగా పాడవుతాయి.