అమోఘమైన రుచి, అరుదైన లక్షణాలు గల దివ్యౌషధం తేనె. సౌందర్యానికీ, ఆరోగ్యానికీ దోహదపడే సుగుణాల గని. అందుకే ఆహారంలోనూ, ఔషధాల్లోనూ తేనె వాడకం ఎక్కువ. ముఖ్యంగా వేసవిలో తలెత్తే సమస్యలకు చక్కని పరిష్కారం ఇది. చర్మం జిడ్డుగా మారడం, జుట్టు జీవం కోల్పోవడం వంటి వేసవికాల సమస్యలకు తేనె మంచి ఉపశమనం.