తిరుగులేని ఆటతీరుతో భారత మహిళా క్రికెట్ టీమ్ మైదానంలో మెరుపులు మెరిపిస్తున్నది. ఈ జట్టుకు సారథ్యం వహిస్తున్న పంజాబీ అమ్మాయి హర్మన్‌ప్రీత్ కౌర్ తన ఫిట్నెస్ రహస్యాలను మీడియాతో పంచుకున్నదిలా..
వారాంతాలు మినహా మామూలు రోజుల్లో పొద్దున్నే లేస్తాను. శరీరం నిస్సత్తువకు గురికాకుండా నీళ్లు, జ్యూస్ లాంటివి తాగి ట్రైనింగ్‌కి పరిగెడతాను. అది పూర్తయ్యాక టిఫిన్ చేసి కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. ఆటకు సంబంధించిన వ్యూహాలు కూడా ఉదయం పూటే ఆలోచిస్తాను. ట్రైనింగ్, ప్రాక్టీస్ వల్ల తీవ్రంగా అలసిపోయిన శరీరానికి.. బలం అందించేందుకు మిగతా సమయమంతా కేటాయిస్తాను.
ఖాళీ దొరికితే.. టీవీ, వెబ్‌సిరీస్‌లు చూస్తుంటాను. వీడియోగేమ్‌లు ఆడటం, కిట్ బ్యాగ్, డ్రాలు సర్దడం చేస్తుంటాను. మరింత సమయం దొరికితే సినిమాకి వెళ్తాను. అవకాశం ఉంటే స్నేహితులతో ముచ్చట్లు పెడతాను. నా పెంపుడు కుక్కతో కలిసి కొండ ప్రాంతాల్లో సేదతీరతాను. నా పప్పీతో గడిపే సమయం నాకెంతో ఇష్టం.