చిత్రకారులకు తెల్లకాగితమే కాదు గోడలూ, దారులూ కూడా కాన్వాసుల్లానే అనిపిస్తాయి. వాటి మీద కూడా అందమైన బొమ్మలే కనిపిస్తాయి. హైదరాబాద్‌కు చెందిన ఆర్టిస్ట్ స్వాతి కూడా అంతే. రోడ్ల మీదా, స్కూళ్ల గోడల మీదా అందమైన చిత్రాలను గీస్తూ ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఈ సారి మాత్రం ఇంకొంత కొత్తగా
ఆలోచించారు. కానీ ఇందుకోసం కాన్వాసు, కుంచె వాడలేదు. హైదరాబాద్‌లోని రహదారులే గీతలుగా.. విశ్వాసానికి చిహ్నమైన కుక్క బొమ్మ సృష్టించారు.
ఇందుకు ఆమె పూర్తిగా టెక్నాలజీనే వాడారు. ముందుగా గూగుల్ మ్యాప్స్ ఆధారంగా నగర రోడ్ల మీద కొన్ని గుర్తులు పెట్టుకుని ఆ దారుల్లో ప్రయాణించారు. ఆ మార్గాన్ని గూగుల్ మ్యాప్స్‌లో చూస్తే.. శునకం ఆకారం కనిపించేలా ప్రణాళిక వేసుకున్నారు. నెహ్రూ అవుటర్ రింగ్‌రోడ్ ఇందుకు వేదికైంది. హైదరాబాద్‌లో ఇలాంటి ప్రయత్నం జరగడం ఇదే తొలిసారి. జీపీఎస్ ద్వారా ఎవరైనా ఇలాంటి చిత్రాలు సృష్టించవచ్చు. జీమెయిల్ ద్వారా లాగిన్ అయితే మనం వెళ్లిన దారి మొత్తం ఓ బొమ్మలా కనిపిస్తుంది.