బహుమతుల ఎంపిక ఎవరికైనా ఓ సవాలే. ఏం కొనాలి? అనే ప్రశ్న స్థిమితంగా ఉండనీయదు. గంటలతరబడి ఆలోచించినా పరిష్కారం దొరకదు. అలాంటి సమయంలో మనల్ని ఆదుకునే బంగారం లాంటి ఐడియా.. గోల్డెన్ ఫ్రేమ్ ఫొటోగ్రాఫ్. కొంచెం ముందుగానే ప్లాన్ చేసుకుంటే.. ‘డివినిటీ’ అనే సంస్థ ఆ ప్రయత్నంలో మనకు సాయపడుతుంది. ఫొటో ఫ్రేమ్, లోపలి ఫాయిల్స్.. స్వచ్ఛమైన బంగారంతో తయారు చేయించి ఇస్తుంది.
ఇందుకు యాభైవేల పైచిలుకు ఖర్చు అవుతుంది. అయితేనేం, మహా గ్రాండ్‌గా కనిపిస్తుంది. ఆత్మీయులు మురిసిపోతారు. బంధాలు బలపడతాయి. అందుకోగానే అటకెక్కించకుండా.. షోకేస్‌లో అలంకరించుకుంటారు. నలుగురికీ గొప్పగా చెప్పుకొంటారు. సంస్థ వెబ్సైట్లోకి వెళ్లి ఫొటో అప్లోడ్ చేస్తే.. ఆ ఫ్రేమ్‌లో మనవాళ్ల ఛాయాచిత్రం ఎలా ఉంటుందో కళ్లారా చూసుకోవచ్చు.