ధనియాలు, మిరియాలు, శొంఠి, ఆవాలు, జీలకర్ర, పసుపు, బిర్యానీ ఆకులు.. వీటన్నిటితో కూడిన పోపు డబ్బా డాక్టరు చేతిలోని మందుల సంచి లాంటిది. ప్రతి దినుసుకూ ఔషధ విలువలు ఉన్నాయని చెబుతారు పరిశోధకులు. అన్నీ కలిస్తే.. ఆ శక్తి ఇనుమడిస్తుంది. ఫలితంగా జీర్ణశక్తి పెరుగుతుంది, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. బ్లడ్ షుగర్ కూడా అదుపులోకి వస్తుంది. అంతేనా,మలబద్ధకం పరార్. నోటి దుర్వాసన దూరం అవుతుంది. చిగుళ్లు గట్టి పడతాయి. వృద్ధాప్య లక్షణాలు మందగిస్తాయనీ చెబుతున్నారు. కాకపోతే.. అతి సర్వత్ర వర్జయేత్ అనే సూత్రం ఇక్కడ కూడా వర్తిస్తుంది. సాధ్యమైనంత వరకూ తాజాగా నూరిన మసాలాలే ఉత్తమం.