Apps:
Follow us on:

Tips | గుడ్లను ఉడకబెట్టేటప్పుడు పగిలిపోకుండా ఉండాలంటే… ఈ చిట్కాలను పాటించండి

1/6ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే గ్లాసెడు పాలు, ఒక కోడిగుడ్డు (Egg) తింటే సరిపోతుందని ప్రతి వైద్యుడు, ఆరోగ్య నిపుణుడు సూచించే ప్రాథమిక ఆరోగ్య సూత్రం ఇదే. మరి వారి సూచనలో కోడిగుడ్డుకు అంత ప్రాధాన్యం ఉన్నందున గుడ్లను ఉడకబెట్టేటప్పుడు అవి పగిలిపోకుండా ఉండాలంటే ఏమి చేయాలో కొన్ని చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.
2/6గుడ్లు ఉడకబెట్టిన సమయంలో  కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. ఉడికేటప్పుడు పెంకు పగిలి సొన బయటకు రావడం జరుగుతుంది. దీంతో పాటు పెంకు సరిగా రాక ఉడికిన గుజ్జుతో పెంకు బయటకు రావడం కూడా సమస్యగా మారుతుంది. ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని సూచనలు పాటించాలని సూచిస్తున్నారు .
3/6మీరు గుడ్ల సంఖ్యకు అనుగుణంగా పాత్రసైజును ఎంచుకుని ఉడికిస్తే సరైన ఫలితం ఉంటుంది, గుడ్ల సంఖ్య ఎక్కువై పాత్ర చిన్నదయినపుడు ఉడికే సమయంలో గుడ్డు మరో గుడ్డుకు తగిలి పగిలిపోతుంది. ఎక్కువ గుడ్లను ఉడకబెట్టాలనుకుంటే పెద్ద పాత్ర తీసుకోవాలని వంట ప్రవీణులు సూచిస్తున్నారు.
4/6గుడ్లు చక్కగా ఉడకాలంటే వెనిగర్ ఉపయోగించాలి. ముందుగా ఒక పాత్రను తీసుకొని అందులో నీటిని నింపి ఆ తర్వాత ఒక టీస్పూన్ వెనిగర్ వేయాలి. ఆ తర్వాత గుడ్లను వేడిచేస్తే పెంకులు ఈజీగా ఊడి వస్తాయని తెలిపారు.
5/6ఇక రిఫ్రిజిరేటర్‌లో ఉంచి తీసిన కోడిగుడ్డును వెంటనే వేడి నీటిలో వేసి ఉడికించే ప్రయత్నం చేసినా అవి పగలిపోయేందుకు అవకాశాలుంటాయి. గుడ్లను ఫ్రిజ్ నుంచి తీసాక గది ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాత ఉడికిస్తే సులువుగా పెంకులు ఊడివస్తాయి .
6/6ఒక పాత్రలో సగం వరకు నీటిని నింపి ఉప్పు లేదా వెనిగర్ వేసి మరిగించాలి. నీరు గోరువెచ్చగా అయిన పిదప గుడ్లను వేసి మూతపెట్టి 15 నిమిషాలు ఉడికిస్తే పెంకులు సులభంగా ఊడి వస్తాయి.