‘ఒక్క ఐదు నిమిషాలమ్మా..’ ఈ మాట ప్రతి ఇంట్లో ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి వినిపిస్తూ ఉంటుంది. బ్రష్ చేసుకోవడం, స్నానం చేయడం, బ్రేక్‌ఫాస్ట్.. అమ్మ దేనికి పిలిచినా ‘ఫైవ్ మినిట్స్ ప్లీజ్’ అంటూ వాయిదా వేస్తుంటారు పిల్లలు. ఆ ఐదు నిమిషాలు అక్కడితో ఆగదు. అరగంట, గంట వరకూ సాగుతుంది. ఈ సమస్యను ఎలా అధిగమించాలో చాలామంది అమ్మలకు తెలియదు.
దీనికో పరిష్కారం ఉంది. ‘ఒక్క ఐదు నిమిషాలమ్మా!’ అంటూ పిల్లలు ముద్దుగా రిక్వెస్ట్ చేయగానే.. ‘సరే కానీ, నీకూ గుర్తుండాలి కదా’ అంటూ పక్కనే ఓ స్టాప్ వాచ్ పెడితే సరి. మొదట్లో విసుక్కుంటారు, తిట్టుకుంటారు, గొణుక్కుంటారు. క్రమంగా స్టాప్‌వాచ్ అవసరమే లేకుండా పోతుంది. వాయిదాలకు ఫుల్స్టాప్ పడిపోతుంది. సమయం, డబ్బు, చదువు, క్రమశిక్షణ.. ఏ విషయంలో అయినా పిల్లలకు వాటి విలువ తెలియజెప్పడం కన్నవారి బాధ్యత.