ఇన్‌స్టాగ్రామ్‌లో అందంగా కనిపించాలి. సెల్ఫీలో మెరిసిపోవాలి. ప్రొఫైల్ పిక్ అదిరిపోవాలి. స్టేటస్‌లో మన ైస్టెల్ తొంగిచూడాలి. ఆధునిక మహిళలో సౌందర్య స్పృహ పెరిగిపోతున్నది. దీంతో ఒక్క కిలో తేడా వచ్చినా డిప్రెషన్లోకి వెళ్లిపోతున్నారు చాలామంది. ఆ అదనపు బరువు దించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.వ్యాయామం లేకపోవడం, జంక్‌ఫుడ్.. ఇవే కాదు. లావైపోవడం వెనుక బరువైన కారణాలు చాలానే ఉన్నాయి.
హైపోథైరాయిడిజం
హఠాత్తుగా బరువు పెరిగిందంటే.. అది హైపోథైరాయిడిజం కావచ్చు. దీనివల్ల జీవక్రియ మందగిస్తుంది. ఫలితంగా లావైపోతారు. నిస్సత్తువ, పొడి చర్మం, జుట్టు రాలిపోవడం, మలబద్ధకం అదనపు లక్షణాలు.
పాలిసిస్టిక్ ఒవరీ సిండ్రోమ్
ఈ సమస్యతో బాధపడేవారిలో ఆండ్రోజెన్స్ అనే పురుష హార్మోన్ల ఊట అధికంగా ఉంటుంది. దీంతో పీరియడ్స్ సక్రమంగా రావు. అవాంఛిత రోమాలు ఇబ్బంది పెడతాయి. ఇన్సులిన్‌ను శరీరం సమర్థంగా ఉపయోగించుకోదు. బరువు పెరగడానికి ఇదో ప్రధాన కారణం. అందులోనూ పొట్ట పరిసరాల్లో కొవ్వు పేరుకుపోతుంది.
పెరిమెనోపాజ్
మెనోపాజ్‌కు ముందుదశ ఇది. ఈ సమయంలో ఈస్ట్రోజెన్ హార్మోన్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. దీంతో ఊబకాయం వచ్చేస్తుంది. అతికోపం, అసహనం, ఏడుపు.. ఇలా హఠాత్తుగా మూడ్స్ మారిపోతుంటాయి.ఇవేకాదు.. మధుమేహం, డిప్రెషన్, డీహైడ్రేషన్ కూడా బరువును పెంచేస్తాయి. యాంటీడిప్రెసెంట్స్, బీపీ మందులు, కొన్నిరకాల స్టెరాయిడ్స్ వల్ల కూడా ఇలా జరుగవచ్చు. కొన్ని ఔషధాలైతే నేరుగా ఆహార వ్యవస్థను క్రమబద్ధం చేసే ఎంజైమ్‌లను దెబ్బతీస్తాయి. కాబట్టి, వేయింగ్ మెషిన్లో అంకెలు మారగానే.. కంగారుపడి లంఖణాలు చేయకుండా.. సమస్య మూలాలను తెలుసుకోవాలి. వైద్యుల సలహాలు పాటించాలి.