ఒంటరినైపోయాననిపిస్తుందా?!.. అనుమానం వద్దు మీ జర్నీ కొనసాగించండి
బాల్య, కౌమారాల్లో ప్రతి పరిచయాన్నీ స్నేహంగానే భావిస్తాం. చిన్నపాటి ఆత్మీయతకే కరిగిపోయి మన కథంతా వినిపిస్తాం. గుండె తేలికచేసుకుంటాం. ఎక్కడా ఎలాంటి వడపోతలూ ఉండవు. పట్టా చేతికొచ్చే సమయానికి మనలోని అచ్చమైన అమాయకత్వం మాయమైపోతుంది.
నా వయసు ముప్పై ప్లస్. ఆఫీసులో బాధ్యతల కారణంగా బయటి ప్రపంచంతో దాదాపుగా సంబంధాలు తెగిపోయాయి. ఎవరి ఫంక్షన్స్‌కూ వెళ్లను. ఎలాంటి వేడుకలూ చేసుకోను. దీంతో ఎక్కడైనా తారసపడితే, పరాయిదానిలా చూస్తున్నారు. అమ్మానాన్నలు కూడా ఎక్కడో మరో రాష్ట్రంలో ఉంటారు. కొత్త సంవత్సరంలో అయినా, కొత్త జీవితం ప్రారంభించాలని నా ఆశ.
- ఓ పాఠకురాలు
బాల్య, కౌమారాల్లో ప్రతి పరిచయాన్నీ స్నేహంగానే భావిస్తాం. చిన్నపాటి ఆత్మీయతకే కరిగిపోయి మన కథంతా వినిపిస్తాం. గుండె తేలికచేసుకుంటాం. ఎక్కడా ఎలాంటి వడపోతలూ ఉండవు. పట్టా చేతికొచ్చే సమయానికి మనలోని అచ్చమైన అమాయకత్వం మాయమైపోతుంది. ప్రతి మనిషిని శంకించడం ప్రారంభిస్తాం. ఎదుటి వ్యక్తి మాటలను భూతద్దంలోంచి గమనిస్తాం. ఆ పలకరింపులో స్వార్థం ఉందేమో అని అనుమానిస్తాం. ఆ ఆత్మీయతలో కుట్ర కోణాన్ని ఊహించుకుంటాం.
ఆ వడపోత మధ్య నిజమైన స్నేహాలు కూడా పక్కకు తొలగిపోతాయి. దీంతో ప్లాస్టిక్ నవ్వులు, కృతకమైన అనుబంధాల మధ్య బతుకుతున్నామనే భావన కలుగుతుంది. ప్రస్తుతం మీరు ఈ దశలో ఉన్నారు. ఎదుటి మనిషిపై అంచనాలు పెట్టుకోవద్దు. ఫలానా విధంగానే స్పందించాలనే ఆలోచన వద్దు. యథాతథంగా ఆమోదించండి. నిజాయతీలేని స్నేహాలు ఏదో ఓ దశలో కూలిపోతాయి. వాటిని బలవంతంగా నిలబెట్టే ప్రయత్నం వద్దు. అంతిమంగా ఒకరో ఇద్దరో మిగులుతారు. కాబట్టి, జడ్జిమెంట్ పక్కన పెట్టి జర్నీ ఎంజాయ్ చేయండి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

