HomeLifestyleEven Across Generations The Connection Between Women And Jewelery Remains Unique
విలక్షణ నక్షి
తరాలు మారినా మహిళలకు, ఆభరణాలకు ఉండే అనుబంధం ఎప్పటికీ ప్రత్యేకమే. నాగరికత ఎంత పెరిగినా సంస్కృతి, సంప్రదాయాల ఆభరణాలకే మొగ్గు చూపుతారు అతివలు. అందుకే ప్రాచీన సంప్రదాయ ఆభరణాలకు ఆధునికతను జోడిస్తూ కొత్త డిజైన్లతో మహిళలను ఆకట్టుకుంటున్నారు తయారీదారులు. నయా నగిషీలు అద్దుకున్న నక్షి నగలు ఈ తరాన్ని తెగ ఆకర్షిస్తున్నాయి.
తరాలు మారినా మహిళలకు, ఆభరణాలకు ఉండే అనుబంధం ఎప్పటికీ ప్రత్యేకమే. నాగరికత ఎంత పెరిగినా సంస్కృతి, సంప్రదాయాల ఆభరణాలకే మొగ్గు చూపుతారు అతివలు. అందుకే ప్రాచీన సంప్రదాయ ఆభరణాలకు ఆధునికతను జోడిస్తూ కొత్త డిజైన్లతో మహిళలను ఆకట్టుకుంటున్నారు తయారీదారులు. నయా నగిషీలు అద్దుకున్న నక్షి నగలు ఈ తరాన్ని తెగ ఆకర్షిస్తున్నాయి. రాయల కాలం నాడు ప్రత్యేకత
చాటుకున్న ఈ నగలు మళ్లీ ఇప్పుడు మగువల మేనిపై రాయల్‌గా మెరిసిపోతున్నాయి.
నక్షి ఆభరణాల మూలాలు కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఈ నగల రూపకల్పన చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ‘నక్షి’ అనే పదం ‘నక్ష’ నుంచి వచ్చింది. నక్ష అంటే నమూనా, డిజైన్ అని అర్థం. దక్కన్ సాంస్కృతిక వారసత్వంలో లోతుగా పాతుకుపోయిన ‘నక్షి’ నగలు కాలానికి తగ్గట్టుగా నయా రూపాలు సంతరించుకున్నాయి. ఈ ఆభరణాల తయారీకి వాడే ప్రధాన లోహం బంగారం. సూక్ష్మంగా చెక్కే
నగిషీలు నగలకు మరింత వన్నె తెస్తాయి.
ప్రస్తుతం బంగారంతోపాటు పోతపోసినవీ అందుబాటులో ఉన్నాయి. పైగా వీటి తయారీలో ప్రకృతి అందాలకు ప్రాముఖ్యం ఎక్కువగా కనిపిస్తుంది. పూలు, పండ్లు, పక్షులు, ఏనుగులతోపాటు వివిధ జ్యామితీయ ఆకారాలనూ ఈ నగల్లో నిగనిగలాడిస్తున్నారు డిజైనర్లు. ముత్యాలు, నవరత్నాలు పొదిగిన వెరైటీలు కూడా అందుబాటులో ఉన్నాయి. పెండ్లిళ్లు, పండగల వంటి సంప్రదాయ వేడుకల్లో ధరించే దుస్తులపైకి నక్షి నగలు చక్కని ఎంపిక. వన్‌గ్రామ్ గోల్డ్‌లోనూ ఇవి అందుబాటులో ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి!