Types of Paan | ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేసే పాన్ల్లో వందల రకాలున్నాయని తెలుసా !
Types of Paan | తమలపాకులో రకరకాల దినుసులను దట్టించి పొట్లంలా చుడతారు కాబట్టి .. మనోళ్లు ‘పాన్' అని పేరు పెట్టారు. పాన్ అనగానే.. చాలామందికి కలకత్తా, స్వీట్, బాబా కశ్మీరీ, నవరతన్, మీనాక్షి ఇలా ఓ పదీ ఇరవై గుర్తొస్తాయి. కానీ, పాన్లలో వందల రకాలున్నాయి.
Types of Paan | పాన్.. మౌత్ ఫ్రెష్నర్ మాత్రమే కాదు. ఆరోగ్య సంజీవని కూడా. ఇందులోని ఔషధ గుణాలు ఆహారాన్ని పూర్తిగా జీర్ణం చేస్తాయి. మలబద్ధకాన్ని నివారిస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్యలను దరిదాపుల్లోకి కూడా రానివ్వవు. తమలపాకులో విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు, థయమిన్, నియాసిన్, రిబోఫ్లేవిన్, కెరోటిన్ పుష్కలం. ఆకు, సున్నం, వక్క .. మూడూ తోడై ఆస్టియోపొరోసిస్ వ్యాధిని దూరం చేస్తాయి. అనేక ఆరోగ్య ప్రయోజనాలున్న తమలపాకులో రకరకాల దినుసులను దట్టించి పొట్లంలా చుడతారు కాబట్టి .. మనోళ్లు ‘పాన్’ అని పేరు పెట్టారు. పాన్ అనగానే.. చాలామందికి కలకత్తా, స్వీట్, బాబా కశ్మీరీ, నవరతన్, మీనాక్షి ఇలా ఓ పదీ ఇరవై గుర్తొస్తాయి. కానీ, పాన్లలో వందల రకాలున్నాయి.

కపుల్ పాన్
మహారాష్ట్ర ఔరంగాబాద్‌లోని తారా పాన్‌షాప్‌లో దొరికే ‘కపుల్ పాన్’ చాలా ఫేమస్. దూరప్రాంతాల నుంచి వచ్చి మరీ ఎన్నో జంటలు రుచి చూసి వెళ్తాయి. స్థానికులు శోభనం రోజున ప్రత్యేకంగా ఆర్డర్ చేస్తారు. ఈ సెట్లో రెండు కిళ్లీలు ఉంటాయి. ఎవరిది వారు తినేయడం కాదు. ఒకరు మరొకరికి ఇచ్చుకోవాలి. చేతితో కాదు.. పెదాలతో!

పాన్ స్టూడియో
ఫొటో స్టూడియోలు తెలుసు. ఆర్ట్ స్టూడియోలు చూశాం. బొటిక్ స్టూడియోల గురించీ వింటున్నాం. బెంగళూరులోని ఫేజర్ టౌన్లో ఓ అన్నదమ్ములు ఈ పాన్ స్టూడియో ఏర్పాటు చేశారు. వీరి దగ్గర 150 రకాల పాన్లు దొరుకుతాయి. చాక్లెట్, కాఫీ, కేసరి, పుదీనా ఇలా 100 ఫ్లేవర్డ్ పాన్లను అందిస్తున్నారు మతీన్ బ్రదర్స్. దేని రుచి దానిదే. వరుసబెట్టి ఓ అరడజను లాగించొచ్చు.

వందలాదిగా..
మహారాష్ట్రలోని నాసిక్‌లో ఆరొందల రకాల పాన్లు లభిస్తాయి. ఈ దుకాణం ఏర్పాటే ఓ సక్సెస్ స్టోరీ. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం లభించక పోవడంతో గణేష్ దుక్రే అనే పట్టభద్రుడు పుణె వెళ్లి ఓ పాన్‌షాప్‌లో పనికి కుదిరాడు. ఆసమయంలోనే పాన్ తయారీ విధానం ఆపోశన పట్టాడు. సొంతూరికి వచ్చేసి పాన్‌డబ్బా పెట్టుకున్నాడు. అందులోనే తన ప్రత్యేకత చాటాడు. దాదాపు 600 రకాల పాన్లు కడుతున్నాడు. ఐస్‌క్రీమ్ పాన్, జీలీపాన్, ఫ్రూట్ పాన్, లిక్విడ్ పాన్, పాన్ ముజీదే, పాన్ షాట్, ఆయుర్వేదిక్ పాన్, స్వీట్ పాన్, మగాయి పాన్, గుల్కండ్ పాన్.. ఇలా చెప్పుకొంటూ పోతే చాంతాడే. కొన్నింటి ధర లక్ష పైమాటే.

కోరమంగళ పాన్‌షాప్
బెంగళూరులోని కోరమంగళ ఎంపైర్ రెస్టారెంట్లో ఓ పాన్‌షాప్ ఉంది. ఇక్కడ 132 రకాల పాన్లు దొరుకుతాయి. నోటిని తియ్యగా మార్చే స్వీట్ పాన్ నుంచి భగభగమండే ఫైర్ పాన్ వరకూ అనేక రుచులు.

పొగాకు లేకుండానే..
ఢిల్లీలోని అమర్ కాలనీలో ‘షాన్ ఎ పాన్’ ఎప్పుడూ కస్టమర్స్‌తో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక్కడ పొగాకు ఉత్పత్తులు వాడని 51 రకాల పాన్లు తయారు చేస్తారు. కివీ పాన్, కాఫీ పాన్, పటాకా పాన్, కుకీస్ పాన్, కాటన్ క్యాండీ పాన్, కొకొనట్ పాన్.. ఇలా ఆరోగ్యానికి పొగపెట్టని పాన్లకు ఈ పాన్‌షాప్ కేరాఫ్ అడ్రస్. యమూస్ పంచాయత్‌లో.. డ్రైఫ్రూట్స్‌తో కట్టిన పాన్‌ను బంగారం కోటింగ్ వేసిన పేపర్లో చుట్టి ఇస్తారు. కానీ.. పాన్ ప్రియులూ! ఎక్కడ పడితే అక్కడ తుపుక్కున ఉమ్మేయకండి ప్లీజ్.
Read More :
“Tours | విహారయాత్రలకు వెళ్లేప్పుడు ఎలాంటి ఆహారం తినాలి.. ఎంత మోతాదులో తినాలి?”
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- Food
- paan
- variety food
RELATED ARTICLES
తాజా వార్తలు
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

