అరిటాకులో భోజనం చేయడం ఒకప్పటి అలవాటు. రోజూ కుదరకపోయినా.. కనీసం పండుగలకో, పబ్బాలకో తినేవారు. ఈ పద్ధతి నేటికీ కొనసాగుతున్నది. సంప్రదాయ వైద్యంలో అరిటాకుకు ఎంత ప్రాధాన్యత ఉందో తెలిస్తే, అందులో తినాలని ఎందుకు సూచిస్తారో తెలుస్తుంది..

అరిటాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల జలుబు, దగ్గులాంటి వైరల్ సమస్యలను శరీరం సమర్థంగా ఎదుర్కోగలదు.
కడిగిన అరిటాకుతో గాయాన్ని చుడితే,అందులోని ఔషధ గుణాల వల్ల గాయం త్వరగా మానుతుంది.
అరిటాకుల రసాన్ని జుట్టుకు రాసుకుంటే చుండ్రు, తెల్ల వెంట్రుకలు లాంటి సమస్యలు దూరమవుతాయట.
వీటిలో ఉండే రూటిన్ అనే పోషకం వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. అలాగే శరీరంలోని మాల్టోజ్ అనే ఒక రకం చక్కెరను నియంత్రించి, షుగర్ నిల్వలు పెరగకుండా చేస్తుంది.
అరిటాకులోని లెక్టిన్ అనే రసాయనంరోగనిరోధకశక్తిని పెంచే టి-సెల్స్ పెంపునకు సాయపడుతుంది.
అరిటాకులో ఆహారం తీసుకునేటప్పుడు.. దాని నుంచి వచ్చే సువాసన ఆకలిని కలిగిస్తుందట. అందులో చుట్టిన ఆహార పదార్థాలు ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి.