న్యూఢిల్లీ : వారం రోజుల పాటు అటు ఆఫీసు పని ఒత్తిళ్లు, ఇటు ఇంటి పనులు చక్కబెట్టే అతివల అలసట (Weekend Snacks) మాటలతో తీరేది కాదు. వీక్‌డేస్‌లో అవిశ్రాంతంగా పనిచేసే మగువలు, మగానుబావులు వారాంతంలో ఆత్మీయులతో గడపడంతో పాటు ఇష్టమైన ఫుడ్ ఎంజాయ్ చేస్తూ కాస్త సేదతీరాలనుకుంటారు.
వీకెండ్లో ఫ్రెండ్స్, బంధువులు, అతిధులు తలుపు తడుతుంటారు. వారితో కబుర్లతో సమయం తెలియకపోయినా అతిధుల కోసం ఇష్టమైన వంటకాలు ప్రిపేర్ చేయడంలోనూ చాలా మంది ఆనందం వెతుక్కుంటారు. ఆత్మీయులతో పాటు కుటుంబసభ్యులు ఇష్టమైన డిష్‌లతో రుచిని ఆస్వాదిస్తూనే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని కోరుకుంటారు. ఇక ఏ పార్టీలో అయినా స్నాక్స్ హైలైట్ అవుతుంటాయి.
అందునా పొటాటోలతో చేసే స్నాక్స్ అంటే చిన్నా పెద్దా ఇష్టంగా ఆరగిస్తుంటారు. పొటాటోలతో ఎన్నో రకాల స్నాక్స్ చేసుకోవచ్చు. ఈ వీకెండ్ అలాంటి స్నాక్స్‌తో మీ అతిధులను ఆకట్టుకోండి. చికెన్ లాలిపాప్ తరహాలో శాకాహార రుచులను మేళవిస్తూ ఆలూ లాలిపాప్‌తో అతిధులను మెస్మరైజ్ చేయవచ్చు. ఆలూతో బోలెడన్ని వెరైటీ స్నాక్స్ చేసుకోవచ్చు. అటు అతిధులు, ఇటు మీ పిల్లలూ మీరూ వీకెండ్‌ను క్రేజీ స్నాక్స్‌తో ఎంజాయ్ చేయవచ్చు. ఏడు రకాల రుచులతో అలరించే ఆలూ వెరైటీ స్నాక్స్ ఇవే..
ఆలూ లాలిపాప్
క్రిస్పీ బబుల్ పొటాటోస్
క్లాసిక్ ఫ్రెంచ్ ఫ్రైస్
పొటాటో రింగ్స్
పొటాటో చీజ్ షాట్స్
ఆలూ టిక్కీ
ఆలూ కార్న్ కట్లెట్స్
Read More :