Parenting | పెళ్లి కాదు.. పై చదువులు ముఖ్యం.. మీ చేతిలోనే పిల్లల ఉజ్వల భవిష్యత్తు!
జీవనశైలిలో, ఆర్థికాంశాల్లో మూసధోరణి విధానాలను అవలంబిస్తే.. అందరిలాగే ఆ తానుముక్కల్లా మిగిలిపోతాం. పరిశోధకులు కొత్తగా ఆలోచిస్తేనే నవీన ఆవిష్కరణలకు మార్గం సుగమం అవుతుంది. తల్లిదండ్రులు ఉన్నతంగా ఆలోచిస్తేనే పిల్లల ప్రగతి సాధ్యమవుతుంది.
జీవనశైలిలో, ఆర్థికాంశాల్లో మూసధోరణి విధానాలను అవలంబిస్తే.. అందరిలాగే ఆ తానుముక్కల్లా మిగిలిపోతాం. పరిశోధకులు కొత్తగా ఆలోచిస్తేనే నవీన ఆవిష్కరణలకు మార్గం సుగమం అవుతుంది. తల్లిదండ్రులు ఉన్నతంగా ఆలోచిస్తేనే పిల్లల ప్రగతి సాధ్యమవుతుంది. పిల్లల ఉజ్జల భవిష్యత్తు కోసం లక్షలు కూడబెట్టడం, భూములు సంపాదించడం, గొప్పగా చదివించడం ఇవన్నీ పేరెంట్స్ బాధ్యతలు. అయితే, చదువు విషయంలో పరిధులు విధించుకుంటే మాత్రం.. మీరు మొదలుపెట్టిన చోటే, మీ పిల్లల ప్రయాణం స్టార్ట్ అవుతుందని గుర్తించుకోండి.
Parenting | ఈ కార్పొరేట్ యుగంలో పిల్లలకు సాదాసీదా చదువులు చెప్పిస్తామంటే కుదరదు. ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ చదివించేసి గొప్పలు చెప్పుకోవడం నిన్నటి తరం తల్లిదండ్రులకు చెల్లింది! ఈ తరం అమ్మానాన్నలు కూడా అదే పాటిస్తామంటే కుదరదు. మీ పిల్లలకు టాలెంట్ ఉంటే సరిపోదు. వాళ్ల ప్రతిభకు తగిన అవకాశాలు కల్పించడం మీ బాధ్యత. అనామక కాలేజీలో ఎంత పెద్ద చదువు చదివిస్తే ఏం లాభం! ఉద్యోగాల వేటలో, కార్పొరేట్ రేసులో మీ బిడ్డలు మెరుపు వేగంతో పరిగెత్తాలంటే.. పెద్ద సంస్థల్లో చదివించడం తప్పనిసరి. ఒక్కోసారి ఎంతటి ప్రతిభ ఉన్నా.. కోరుకున్న కాలేజీలో సీటు రాకపోవచ్చు. ముందస్తుగా మీరు ప్లాన్ చేసుకుంటే గానీ పేరెన్నికగన్న సంస్థలో సీటు పొందలేరు.
దేనికెంత కేటాయించాలి..
కాలం ఎంత మారినా.. తల్లిదండ్రుల మైండ్‌సెట్ మారడం లేదు. అబ్బాయి చదువు కోసం పొదుపు చేసే చాలామంది, అమ్మాయిల విషయంలో పెళ్లి కోసమని డబ్బు దాస్తుంటారు. మంచి ఉద్యోగంలో ఉన్నవాళ్లు పాతిక లక్షల వరకు కూడబెడుతుంటారు. అదే సమయంలో ఎడ్యుకేషన్ దగ్గరికి వచ్చేసరికి రెండు, మూడు లక్షల్లో లక్ష్యం అందుకోవాలని భావిస్తుంటారు. పెండ్లికి కేటాయించిన మొత్తాన్ని మీ అమ్మాయి చదువుపై ఇన్వెస్ట్ చేసి చూడండి! ఆమె ప్రయాణం జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుంది!! దీప్తి కథ చదివితే మీకు ఈ విషయం మరింత లోతుగా అర్థమవుతుంది. దీప్తి చలాకీ అమ్మాయి. ఆమె చెల్లెలు ఇంటర్ చదువుతున్నది. వీళ్ల నాన్న బ్యాంకు ఉద్యోగి. తల్లి కూడా బ్యాంకులోనే పనిచేసేది. ఆర్థికంగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. రెండు ఫ్లాట్లు ఉన్నాయి. పిల్లల కోసం ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసింది. రిటైర్మెంట్ బెనిఫిట్‌గా రూ.45 లక్షలు వచ్చాయి. ఈ మొత్తంతో స్థలం తీసుకున్నారు. దీప్తి ఎంబీఏ చదువుతానంది. తల్లిదండ్రులు కూడా సంతోషంగా అంగీకరించారు. రూ.3 లక్షల్లో ఎంబీఏ అయిపోతుంది. చిన్నమ్మాయి చదువుకు మరో ఐదారు లక్షలు సరిపోతాయి అనుకున్నారు. రెండు ఫ్లాట్స్‌లో ఏ ఒక్కదాన్ని విక్రయించినా రూ.60 లక్షలు వస్తాయి. ఆ మొత్తంతో ఇద్దరు బిడ్డల వివాహాలు ఘనంగా చేసేయొచ్చు అని భావించారు. అందరూ ఇలాగే ఆలోచిస్తారు. పైపైన చూస్తే ఈ ప్రణాళిక పర్ఫెక్ట్గా ఉందని కూడా అనిపిస్తుంది. కానీ, దీప్తి తల్లిదండ్రులు కాస్త డిఫరెంట్‌గా ఆలోచిస్తే.. ఆ పిల్లల జీవితాలు మరింత ఉన్నతంగా ఉంటాయి.
పెళ్లి దగ్గరే ఆగిపోవద్దు..
దీప్తి తండ్రి ఇలా చేస్తే.. బిడ్డకు మహోన్నతమైన లైఫ్‌ను అందించినట్టు అవుతుంది. అదెలాగంటే.. కూతురు పెండ్లికోసం అనుకున్న రూ.30 లక్షలు ఆమె చదువుకు బదలాయిస్తే ఫలితం పదింతలు ఉంటుంది. ఎంబీఏకు రూ.30 లక్షలు ఏంటి? అంటారా! సాదాసీదా కాలేజీలో చదివితే.. పాతికవేల ఉద్యోగంతో సరిపెట్టుకోవాలి. అదే ప్రముఖ బిజినెస్ స్కూల్స్‌లో చదివిస్తే ఆరంభ వేతనమే రూ.15 లక్షల (సంవత్సరానికి) వరకు ఉంటుంది. చాలా తర్జనభర్జనల తర్వాత దీప్తి తండ్రి సాహసం చేశాడు. ఆమెను ప్రఖ్యాత బిజినెస్ స్కూల్లో ఎంబీఏలో చేర్పించాడు. క్యాంపస్ ప్లేస్మెంట్లో దీప్తి ఏడాదికి పాతిక లక్షల రూపాయల ప్యాకేజీ అందుకుంది. పాతికేండ్లు సర్వీస్ చేసిన తన తండ్రి జీతం కన్నా దీప్తి ప్రారంభ వేతనం ఎక్కువ! ఆయన తీసుకున్న తెలివైన నిర్ణయం దీప్తి జీవితాన్ని మాత్రమే కాదు.. ఆమె తర్వాతి తరాల జీవితాలనూ ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది అనడంలో సందేహం లేదు. ఏతావాతా విషయం ఏంటంటే.. ఆడపిల్లల సెటిల్మెంట్ పెళ్లి దగ్గరే ఆగిపోవద్దు. విలువైన చదువు చెప్పించాలి. ద బెస్ట్ యూనివర్సిటీలో చదివించాలి. అప్పుడే అది పర్ఫెక్ట్ సెటిల్మెంట్ అనిపించుకుంటుంది.
ఓ తండ్రి ఆవేదన
ఫెయిల్యూర్స్‌కు చిరునామాగా మిగిలిన ఓ తండ్రి కథ ఇది. సంపన్న కుటుంబంలో పుట్టినా.. అందుకు తగ్గట్టుగా ఆయన ఏనాడూ వ్యవహరించలేదు. భార్యను నానా అగచాట్లకూ గురిచేశాడు. దాదాపు ఆస్తులన్నీ కరిగిపోయాక అతనికి జ్ఞానోదయం అయింది. అప్పటికే కూతురు నీట్ రాసింది. అనుకున్నంత ర్యాంకు రాలేదు. ఉన్న ఆస్తంతా అమ్మేసి కూతురిని ప్రైవేట్‌లో ఎంబీబీఎస్ చేయించాలని నిర్ణయించుకున్నాడు. కూతురు వద్దు నాన్న! నేను బీఫార్మసీ చేస్తానంది. అందుకు ఆ తండ్రి ఒప్పుకోలేదు. ‘నా తప్పులకు నీ భవిష్యత్తు భారం కావొద్ద’న్నాడు. ‘నేను మీ అమ్మను ఎన్ని రకాలుగా హింసించానో నాకు తెలుసు. ఆమె స్థానంలో ఎవరున్నా.. నన్ను వదిలిపెట్టేవారే! నీ తల్లి నాకన్నా అందగత్తె! పెళ్లి సమయంలో ఆస్తులు కూడా తెచ్చింది.
అన్నీ ఉన్నా.. సంపాదించే శక్తిలేక, ఆమె కాళ్లమీద నిలబడి బతకగలనన్న నమ్మకం లేక.. ఈ నరకంలోనే ఉండిపోయింది. నీ కోసం నన్ను భరించింది. సొంతంగా సంపాదించలేని ఆమెకు నిన్ను పోషించే శక్తి లేదు. రేపు నీకు అలాంటి దుస్థితి రావొద్దు. ఉన్నతంగా చదివి, మంచి పొజిషన్లో ఉంటే.. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తట్టుకోగలుగుతావు. ఆర్థిక స్వాతంత్య్రం ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది’ అని నచ్చజెప్పాడు. ఉన్న ఒక్క ఆస్తినీ అమ్మేసి కూతురును మంచి కాలేజీలో మెడిసిన్‌లో చేర్పించాడు.
– ఎం. రాం ప్రసాద్
సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
ram@rpwealth.in
www.rpwealth.in
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

