కాస్త బోర్‌గా ఫీలైనా.. రాత్రి ఒంటరిగా ఉన్నా.. తెలియకుండానే మన వేళ్లు ఫోన్లో యాప్‌ల వైపే వెళ్తాయి. అందులోనూ డేటింగ్ యాప్‌లపై పడుతుంటారు చాలామంది. చక్కగా ప్రొఫైల్ క్రియేట్ చేసి.. స్క్రోల్ చేస్తూ ఉంటారు. నచ్చిన ప్రొఫైల్ కంటపడితే కుడివైపు.. లేదంటే ఎడమవైపు స్వైప్ చేస్తుంటారు. మనకు ఎవరైనా, మనం మరెవరికైనా మ్యాచ్ అయ్యామా చిన్న హ్యాపీ ఫీలింగ్ కలుగుతుంది. ఇంతవరకు బాగానే ఉంది! కానీ, డేటింగ్ యాప్ ట్రెండ్‌లో ఇప్పుడు కొత్త పోకడ పొద్దుపొడిచింది. ప్రొఫైల్‌ని మ్యాచ్ చేస్తారు కానీ, మాట్లాడటానికి ఆసక్తి చూపరన్నమాట! ఈ కొత్త అలవాటుకు ‘ఈగో స్క్రోలింగ్’ అని నామకరణం చేశారు.
డేటింగ్ యాప్స్‌లో మన విలువ ఎప్పుడూ పూర్తిగా కనిపించదు. మనలో ఉన్న మంచి గుణాలన్నీ డిజిటల్ ప్రపంచంలో ఎప్పుడూ చూపించలేం. సో.. వీటి ప్రభావం నుంచి బయటపడేందుకు నిజ జీవితంలో స్నేహితులతో ఎక్కువగా గడపండి. డిజిటల్ డేటింగ్‌కు వీలైనంత దూరం పాటించండి.
కొంతమంది రియల్ లైఫ్‌లో ఎలాగైతే చాటు, మాటు వ్యవహారాలు చేస్తుంటారో.. అలాంటి వాళ్లే డేటింగ్ యాప్‌లో దోబూచులాడుతున్నారు. ఈగో స్క్రోలింగ్ చేస్తూ.. టైమ్ పాస్ చేస్తున్నారట. ఇది కనెక్షన్ కోసం కాదు. వాళ్ల ఈగో సాటిఫ్యాక్షన్ కోసం!! ఈ మధ్య యూజర్స్‌లో కొందరు తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి మాత్రమే డేటింగ్ యాప్స్ జోలికి వస్తున్నారట. వీళ్లు నిజంగా డేటింగ్‌కు వెళ్లాలని అనుకోరు. కేవలం వాళ్ల డిమాండ్ నిరూపించుకోవడానికే స్క్రోలింగ్, స్వైప్ చేస్తుంటారు. ఇందులో ఏం ఇబ్బంది ఉంది అనుకున్నా.. దీనివల్ల ఇతరులకు చాలా సమస్యలు తలెత్తుతున్నాయట!
ఈగో స్క్రోలింగ్ చేసేవారు తమ వల్ల ఎవరికీ ఇబ్బంది లేదని భావిస్తూ ఉంటారు. కానీ, దీనివల్ల నిజమైన కనెక్షన్ కోసం ఎదురుచూస్తున్న వారికి చాలా సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని నిపుణుల మాట. మ్యాచ్ అవుతున్నవారు చాలామందే ఉన్నా.. ఎవరూ తనతో మాట కలపకపోవడంతో తమ ప్రొఫైల్‌ని ఎవరూ పట్టించుకోవడం లేదనే ఒత్తిడికి గురవుతారట. కొందరైతే ఆత్మవిశ్వాసం సన్నగిల్లి నిరాశలో కూరుకుపోతున్నారట.
కొందరు సరదా కోసం, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇలా ఈగో స్క్రోలింగ్ చేస్తుంటారు. అవతలి వ్యక్తి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి వారికి ఏమాత్రం ఉండదు. మీరూ ఈ కోవకు చెందిన వ్యక్తే అయితే.. మీ వల్ల ఇతరులు ఇబ్బందిపడుతున్నారని గుర్తెరగాలి. మీకు నిజంగా అవసరం అనిపిస్తేనే డేటింగ్ యాప్‌ని ఇన్స్టాల్ చేసుకోవాలి. నిజంగా డేటింగ్ కోరుకున్నట్లయితే.. మీకు సూటబుల్ మ్యాచ్‌తో
కనెక్ట్ అవ్వాలి. అంతేకాని, అవతలి వ్యక్తి భావోద్వేగాలతో ఆటలాడొద్దు.
డేటింగ్ యాప్‌లలో మీకంటూ సరిహద్దులు పెట్టుకోవాలి. డేటింగ్ ఎంతవరకు అన్నదానిపై స్పష్టత కలిగి ఉండాలి. మీకు నిజంగా మ్యాచ్ అయ్యేవారుంటే మాట కలపాలి. అంతేకానీ, మాట్లాడేసి.. చాటుగా మాటేస్తానంటే కుదరదు! ఒక్కోసారి కొందరు ఇలా మాట్లాడేసి… అలా పలకరించడం మానేస్తారు!! ఇలాంటి సందర్భల్లో మనసు బాగా అలసిపోతుంది. దీన్నే డిజిటల్ ఎమోషనల్ బర్నవుట్ అంటారు.