Chai in Coconut Shell: ఈ ప్రపంచంలో చాయ్ అంటే ఇష్టపడని వాళ్లు చాలా తక్కువగా ఉంటారు. ఇక భారతీయులు చాయ్‌ని ఎంతగా ఆస్వాదిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అన్న తేడా లేకుండా ఎప్పుడైనా వేడివేడి కడక్ చాయ్‌ని ఎంజాయ్ చేస్తుంటారు. ఈ చాయ్‌లో ఒక్కొక్కరు ఒక్కో టేస్ట్‌ను కోరుకుంటారు. కొందరు తియ్యగా, మిల్కీగా ఉండే చాయ్‌ని ఆస్వాదిస్తే.. మరికొందరు హాట్‌హాట్‌గా ఉండే మసాలా చాయ్‌ని ఇష్టపడతారు. అయితే ఇంత క్రేజీ ఉన్న ఈ చాయ్‌ను ఎవరైనా వంటపాత్రల్లోనే చేసుకుంటారు. కానీ, ఓ మహిళ మాత్రం ఖాళీ కొబ్బరిచిప్పలో చేసింది. ఎలాగో తెలుసా..?
‘ఈజీ కుకింగ్ విత్ కవిత’ పేరుతో ఉన్న ఇన్‌స్టా హ్యాండిల్లో ఒక వీడియో ఉంది. ఆ వీడియోలో ఒక మహిళ ఖాళీ కొబ్బరిచిప్పలో చాయ్ చేసి చూపించింది. ముందుగా ఆమె గ్యాస్ స్టవ్ వెలిగించి ఒక ఖాళీ కొబ్బరిచిప్పను దానిపై పెట్టింది. తర్వాత ఆ కొబ్బరిచిప్పలో నీళ్లుపోసి, అల్లం, పాలు, తేయాకులు, యాలకులు, చక్కెర వేసింది. ఆ వీడియోకు ‘కోకోనట్ టీ’ అనే టైటిల్ ఇచ్చి పోస్ట్ చేసింది.
ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నది. ఇప్పటికే 4.72 కోట్ల మంది వీక్షించారు. 8.73 లక్షల మంది లైక్ చేశారు. అంతేగాక వేల మంది కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వాటిలో సిల్లీ కామెంట్స్ నుంచి సీరియస్ కామెంట్స్ వరకు అన్నీ ఉన్నాయి. ఇంటర్నెట్లో ఇంత వైరల్‌గా మారిన ఆ వీడియోపై వీలైతే మీరూ ఓ లుక్కేయండి..