Naya Mall | పలు అవసరాల నిమిత్తం ఊర్లు తిరుగుతుంటాం. అలాంటి సందర్భాల్లో చాలా సున్నితమైన సమస్య ఒకటి వెంటాడుతుంది. అదే సీక్రెట్ కెమెరా వ్యవస్థ. హోటల్ గదుల్లోనో.. షాపింగ్ మాల్స్‌లోనో హిడెన్ కెమెరాల్ని అమర్చడం.. వాటి కారణంగా పలు ఇబ్బందుల్ని ఎదుర్కోవడం చూస్తున్నాం. మరి, ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే? షామీ కొత్తగా అందుబాటులోకి తేనున్న స్మార్ట్‌ఫోన్ వాడితే చాలు. ‘హైపర్ ఓఎస్ 2.0’ ఓఎస్‌లో ఈ ఫీచర్‌ని జోడిస్తున్నది. ‘షామీ 14 సిరీస్’ మొబైళ్లలో దీన్ని పరిచయం చేసేందుకు సిద్ధం అవుతుంది. ఫోన్లలో ఈ ఫీచర్‌ని ‘స్కాన్ కెమెరా’గా పిలుస్తున్నారు. దీనితో మనం ఉన్న చోటును ఫోన్ కెమెరాతో స్కాన్ చేస్తే చాలు. రహస్యంగా అమర్చిన కెమెరాల్ని పట్టేస్తుంది. వైర్లెస్ లోకల్ ఏరియా నెట్‌వర్క్‌తో పనిచేసే కెమెరాల్ని ఆయా నెట్వర్క్ సిగ్నల్స్ పట్టుకుని గుట్టు రట్టు చేస్తుంది. ప్రైవసీని కాపాడే ఈ ఫోన్లు నిత్యం ట్రావెల్ చేసేవారికి ఎంతో ఉపయోగం.
ఒక ల్యాప్‌టాప్.. స్మార్ట్‌ఫోన్.. ఇయర్ బడ్స్.. బయటికి వెళ్తున్నాం అంటే ఇవి వెంటే ఉంటాయి. ప్రయాణాల్లో అయితే పక్కాగా ఉంటాయి. వాడకం మామూలుగా ఉండదు కాబట్టి.. ఎప్పుడైనా ఎక్కడైనా చార్జ్ చేయాల్సి రావచ్చు. అందుకే ఈ ‘ట్రావెల్ అడాప్టర్’. దేశం దాటి వెళ్లిపోయినా (యూకే, యూఎస్, యూరప్, ఆస్ట్రేలియా) దీంతో గ్యాడ్జెట్లను చార్జ్ చేయొచ్చు. ఆయా దేశాల్లో వాడే ఎలక్ట్రిక్ పోర్ట్‌లకు అనువుగా మార్చుకునేందుకు ప్రత్యేక బటన్ ఉంది. ఒక్క ల్యాపీలను మాత్రమే కాదు. యూఎస్బీ పోర్ట్‌లతో (డ్యూయల్ యూఎస్బీ-ఏ పోర్ట్స్) రెండు గ్యాడ్జెట్లను చార్జ్ చేసుకునే వీలుంది. ఫాస్ట్ చార్జింగ్‌తో ఇట్టే చార్జ్ అయిపోతాయి.
ధర: రూ.999 దొరికే చోటు: https://shorturl.at/xply3
ఒకప్పుడు మా పిల్లాడు చాలా బుద్ధిమంతుడు అనడం విన్నాం. ఇప్పుడు మా పిల్లాడు చాలా స్మార్ట్ అంటున్నారు. ఎందుకో తెలుసా? సింపుల్.. టెక్నాలజీ. అంతలా పిల్లల చదువుల్లో, జీవనశైలిలో టెక్నాలజీ చాలా కీలకపాత్ర పోషిస్తున్నది. అందుకేనేమో యాపిల్ కంపెనీ పిల్లలకు సరికొత్త స్మార్ట్‌వాచ్‌ని మార్కెట్లోకి తెచ్చింది. దీని పేరు ‘యాపిల్ వాచ్ ఎస్ఈ’. ‘అబ్బో.. యాపిల్ వాచ్ అంటే చాలా ఖరీదు. పిల్లలకు అంత ఖర్చుపెట్టి ఎందుకు కొంటాం’ అనుకునేరు! ఈ కిడ్స్ వాచ్ ధర బడ్జెట్లోనే ఉంది. అల్యూమినియం మెటీరియల్ బదులు ప్లాస్టిక్‌తో రూపొందించింది. అదీ ఫ్యాన్సీ రంగుల్లో. పిల్లల దృష్టిని ఆకట్టుకునే రంగులకు ప్రాధాన్యమిస్తూ దీన్ని తయారుచేశారు. ప్లాస్టిక్ అంటే.. మన్నిక ఎలా ఉంటుందో అనే సందేహం అక్కర్లేదు. క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీపడకుండా డిజైన్ చేసింది యాపిల్. పేరెంటల్ కంట్రోల్స్ దీంట్లో మరో ప్రత్యేకత. లొకేషన్ ట్రాకింగ్‌తో పిల్లలపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచొచ్చు.
వస్తువు ఏదైనా కొందాం అనుకుంటే.. మల్టిపుల్ యూజ్ ఉందా? అనే ఆలోచిస్తాం. అంటే.. వస్తువు ఒకటే అయినా పలురకాలుగా వాడుకోవడంలో ఉన్న కిక్ వేరు. మీరూ ఇలాగే ఆలోచిస్తే ఇదిగో ఈ ‘జీల్యాంప్ విత్ స్పీకర్’ని చూడండి. దీంట్లో మల్టిపుల్ ఫీచర్స్ ఉన్నాయి. కేవలం బెడ్ ల్యాంప్లానే కాకుండా.. స్పీకర్లా మార్చేసి మ్యూజిక్ వినొచ్చు. అలారం క్లాక్లా వాడొచ్చు. అంతేకాదు.. వైర్లెస్ చార్జర్‌లా కూడా పనిచేస్తుంది. అందుకు ఫోన్‌ని ‘జీ’ ఆకారంలో ఉన్న స్టాండ్‌పై పెడితే చాలు. 15వాట్ సామర్థ్యంలో చార్జ్ చేస్తుంది. బెడ్ ల్యాంప్ అంటే ఏదో మామూలు లైట్ అనుకునేరు.. 13 రకాల లైటింగ్ మోడ్స్‌ని మార్చుకుంటూ నచ్చిన రంగు కాంతిని సెట్ చేసుకునే వీలుంది. బ్లూటూత్‌తో ఫోన్‌కి కనెక్టయి పాటలు వినొచ్చు. కాల్స్ మాట్లాడొచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం 6 గంటలకు పైమాటే!
ధర: రూ.2,999 దొరికే చోటు: https://shorturl.at/Ifk4x