ఇంటి అలంకరణలో రకరకాల బొమ్మల్ని వాడతాం. అందులోనూ దేవతామూర్తులది ప్రత్యేక స్థానం. అయితే కాస్త ఘనంగా కనిపించాలంటే మాత్రం ఇత్తడి, పంచలోహ విగ్రహాలను ఆశ్రయించాల్సిందే. వీటికి భిన్నంగా స్వచ్ఛమైన వెండి జోడించి అందమైన బొమ్మలు తయారు చేస్తున్నది.. ఫేజర్ అండ్ హాస్ సంస్థ. రెజిన్ లేదా మార్బుల్లాంటి వాటితో విగ్రహాలను రూపొందించి 92.5 శాతం స్వచ్ఛత కలిగిన వెండి, 24 క్యారెట్ల బంగారంతో అలంకరిస్తారు. జిర్కోన్ తరహా రాళ్లనూ జోడిస్తారు. వివిధ సైజులలో కృష్ణుడు, దుర్గ, శివుడు, వినాయకుడు ఇలా…రకరకాల విగ్రహాల్ని తయారు చేస్తున్నదీ కంపెనీ. ఇటీవల విడుదల చేసిన కలెక్షన్లో లక్ష్మి, గణపతి విగ్రహాలుఆకట్టుకుంటున్నాయి. వెండి బహుమతులు ఇవ్వాలనుకున్నప్పుడు వీటి గురించి ఆలోచించవచ్చు. అందుకున్నవారు ఆనందంగా ఇంట్లో అలంకరించుకుంటారు. మీ బహుమతిని కలకాలం గుర్తుంచుకుంటారు కూడా. ఇక ధరలు ఐదు వేల నుంచీ మొదల వుతాయి.